
బెంగాల్ నుంచి డెరెక్ ఓబ్రెయిన్, డోలా సేన్, సుఖేందు శేఖర్ రే, సమీరుల్ ఇస్లాం, ప్రకాశ్ చిక్ బరాక్, సాకేత్ గోఖలే బరిలో ఉండగా, గోవా నుంచి సదానంద్ షెట్ తనవాడే బరిలో నిలువగా వీరి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. ఇదిలా ఉండగా, జులై 24 తర్వాత 245 మంది సభ్యులున్న రాజ్యసభలో మరో ఏడు సీట్లు ఖాళీ కానున్నాయి.
ఇందులో జమ్మూకశ్మీర్ నుంచి నాలుగు, ఉత్తరప్రదేశ్లో రెండు నామినేటెడ్తో పాటు మరో సీటు ఖాళీ కానుండగా రాజ్యసభలో సభ్యుల బలం 238కి తగ్గనున్నది. అయితే, రాజ్యసభలో మెజారిటీ మార్క్ 120 కానుండగా బీజేపీ, మిత్రపక్షాలు కలుపుకొని ప్రభుత్వానికి 105 సభ్యుల మద్దతు ఉంటుంది. ఐదుగురు నామినేటెడ్, ఇద్దరు స్వతంత్ర ఎంపీల మద్దతు బీజేపీ ఉండడంతో బలం 112కి చేరనున్నది. మెజారిటీ కంటే ఎనిమిది సీట్లు తక్కువ కానున్నాయి.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం