
సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులను కాపాడేందుకు రెండు సి130 విమానాలు, నావికా నౌక ఐఎన్ఎస్ సుమేధను సిద్ధంగా ఉంచారు. అధికార డేటా ప్రకారం సూడాన్‌లో 4000 మంది భారతీయులు ఉన్నారు. జై శంకర్ సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలతో కూడా మాట్లాడారు. ఆ రెండు దేశాలు కూడా సాయపడతామని హామీ ఇచ్చాయి.
సూడాన్‌లో అధికారం కోసం హింసాత్మక ఘర్షణ జరుగుతోంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న అంతర్జాతీయ ప్లాన్‌ను కూడా అక్కడి వారు తిరస్కరించి పోరాడుతున్నారు. రెండు పక్షాల వారు ఒకరినొకరు నిందించుకుంటూ ఘర్షణ పడుతున్నారు.
కాగా, వార్ జోన్ దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులతోపాటు విదేశీయుల తరలింపునకు ‘ఆపరేషన్ కావేరీ’ మిషన్‌ను భారత్ గతంలో చేపట్టింది. తాజాగా సుడాన్ నుంచి భారతీయులు, ఇతర దేశీయుల తరలింపునకు మిత్ర దేశాలతో కలిసి ఈ మిషన్‌ను కొనసాగిస్తున్నది. సోమవారం ఫ్రాన్స్ కూడా సుడాన్ నుంచి 388 మందిని తరలించింది. ఐదుగురు భారతీయులతో పాటు 28 దేశాలకు చెందిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక