
తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు 40 చోట్ల ఒకేసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. బాలవికాసకు సంబంధించిన క్రిస్టియన్ మిషనరీలతో పాటు సంస్థల్లో అధికారులు ఈ దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నది.
ఈ సంస్థకు సంబంధించి ఆర్ధిక లావాదేవీలు, పన్ను ఎగవేతకు సంబంధించి పక్కా ఆధారాలతో అధికారులు పెద్ద ఎత్తున ఈ సోదాలు చేపట్టినట్టు సమాచారం.
మెదక్, వరంగల్ లోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోని అల్వాల్, బొల్లారం, కీసర, జీడిమెట్ల, పటాన్ చెరు, తార్నాక, కూకట్ పల్లి సహా తెలంగాణలోని 40 ప్రాంతాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 9 సంస్థల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకకాలంలో పలు సంస్థలు, కార్యాలయాల్లో దాడులు చేపడుతోన్నారు.
2016లో బాలవికాస్ ఫౌండేషన్ ఏర్పాటైంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఎన్‌జీవోగా బాల వికాస్ రిజిస్టర్ అయ్యింది. మొత్తం ఐటీ అధికారులు 20 బృందాలుగా విడిపోయిన సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ సంస్థల్లో పన్ను ఎగవేతకు సంబంధించిన పక్కా ఆధారాలతోనే సోదాలు చేస్తున్నట్లు సమాచారం.
నగరంలో ఐటీ దాడులు ప్రతి నెలలోనూ ఎక్కడో ఒకచోట జరుగుతోన్నాయి. గతంలో పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతల సంస్థలు, ఇళ్లల్లో జరిగాయి. ఇక పలు రియల్ ఎస్టేట్ ఆఫీసులు, ప్రముఖ వ్యాపారవేత్తల ఇళ్లల్లో పలుమార్లు దాడులు చేపట్టారు. కొద్ది రోజుల క్రితమే గూగి కంపెనీపై ఐటీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు