’35 చిన్న కథ కాదు’ చిత్రంలో మధ్యతరగతి గృహిణిగా అద్భుత నటన కనబరిచిన నివేదా థామస్ ‘ఉత్తమ నటి’గా అవార్డు అందుకున్నారు. ఇండియన్ సినిమా లెజెండ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలోని అశ్వత్థామ పాత్రకు గాను ఉత్తమ సహాయ నటుడి అవార్డును గెలుచుకున్నారు. ఇదే చిత్రానికి గాను నితిన్ జిహాని చౌదరి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును దక్కించుకున్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో కీలక పాత్ర పోషించిన అంజలి ‘ఉత్తమ సహాయ నటి’గా నిలిచారు.
టాలీవుడ్‌కు దక్కిన మరికొన్ని అవార్డులు
ఉత్తమ చిత్రం : పుష్ప 2
ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప 2)
బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ : పుష్ప 2
ఉత్తమ సహాయ నటుడు : అమితాబ్ బచ్చన్ (కల్కి 2898 ఏడీ)
ఉత్తమ సహాయ నటి : అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి)
ఉత్తమ పరిచయ దర్శకుడు : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ పరిచయ నటుడు : సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ పరిచయ నటి : నయన్ సారిక (గం గం గణేశా)
ఉత్తమ సాహిత్యం : చుట్టమల్లె చుట్టేస్తోంది (దేవర), రచయిత: రామజోగయ్యశాస్త్రి
ఉత్తమ గాయకుడు : శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి: గుంటూరు కారం)
ఉత్తమ గాయని : శిల్పారావు (చుట్టమల్లె)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : నితిన్ జిహానీ (కల్కి 2898 ఏడీ), రామకఅష్ణ- మోనిక (పుష్ప 2)
బెస్ట్ కొరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి)
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : లక్కీ భాస్కర్
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : తేజ సజ్జా
ఉత్తమ నటి (క్రిటిక్స్) : కాజల్ అగర్వాల్ (సత్యభామ)

More Stories
వరంగల్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయం కూల్చివేత
జూబ్లీహిల్స్‌లో విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య
ప్రధాని మోదీ పర్యటనలో కానుకగా రూ 8 వేల కోట్ల ప్రాజెక్టులు