13 కోట్ల ఓట్లు పోయాయని రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి అందులోని 3 కోట్ల మంది మరణించిన వారి పేర్లు ఓటర్ల జాబితాలోనే ఉండాలా లేదా తీసేయాలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో లక్షలాది మందితో సహా దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ప్రజలు వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారని చెబుతూ అలాంటప్పుడు ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు హక్కు ఉండాలా? అని నిలదీశారు.
ఇక మిగిలిన 3 కోట్ల ఓట్ల చిక్కుముడి ఏమిటి? 2003 ఓటర్ల జాబితాలో మీ పేర్లు ఎక్కడున్నాయని ఎన్నికల సంఘం అడిగితే వారి ఆచూకీ ఎవరికీ తెలియడం లేదని చెప్పారు. ఆ 3 కోట్ల మంది చొరబాటుదారుల ఓట్ల కోసమే రాహుల్ గాంధీ, ఇండీ కూటమి నేతలు వకాల్తా పుచ్చుకుని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎస్ఐఆర్పై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ఇండియా కూటమికి క్షేత్రస్థాయిలోనే సమాధానం చెబుతామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రాహుల్ జేబులో పెట్టుకుంటే తాము హృదయంలో పెట్టుకుంటామని వ్యాఖ్యానించారు.
రాహుల్‌గాంధీకి ఏటీఎంలా రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏటీఎంలాగా మారారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను దోచి ఢిల్లీ బాసులకు ఖజానాను పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కంటే ఢిల్లీ బాసుల ఆశీర్వాదం కోసమే రేవంత్‌రెడ్డి ప్రదక్షిణలు చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఒక అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపగా, అంతకంటే పెద్ద అవినీతి ప్రభుత్వం వస్తుందని ప్రజలకు అప్పుడు తెలియదని ధ్వజమెత్తారు.
యువత, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కినందుకు రేవంత్ రెడ్డికి ఎలాంటి శిక్ష విధించాలో ప్రజలే నిర్ణయించాలని ఆయన కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పటం ఖాయమని నితిన్ నబీన్ తేల్చి చెప్పారు.
కరీంనగర్ గాంధీ చౌక్ నుంచి కమాన్ చౌరస్తా వరకు బీజేపీ శ్రేణులతో కలిసి నితిన్ నబీన్ పాదయాత్ర చేశారు. ఎస్ఐఆర్పై విపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ నిర్వహించిన ఈ భారీ ర్యాలీకి బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ఎస్ఐఆర్పై వాస్తవాలు వివరించేందుకే మహా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ ఇన్‌ఛార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం-అరాచకాన్ని అంతం చేద్దాం పేరిట దేశవ్యాప్తంగా 40 ర్యాలీలు నిర్వహిస్తుండగా కరీంనగర్లో నేడు నిర్వహించారు.
గాంధీ చౌక్ నుండి టవర్ సర్కిల్ వరకు జన సందోహం బారులు తీరడం కన్పించింది. వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు నితిన్ నబిన్ వెంట నడుస్తూ జోష్ నింపారు. ఇక నితిన్ నబిన్ పాదయాత్ర చేస్తున్నంత సేపు కార్యకర్తలు, బీజేపీ అభిమానులు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఇండ్లు, భవనాల, వ్యాపార సముదాయాలపైకి ఎక్కి నితిన్ నబిన్ పాదయాత్రను జనం వీక్షించడం గమనార్హం.
డప్పు చప్పుల్లు, అట పాటలతోనూ యువత మహా పాదయాత్రలో సర్ కు మద్దతుగా నినాదాలు చేశారు. జాతీయ జెండా చేత పట్టి కొందరు, కాషాయ జెండాలు పట్టుకుని మరి కొందరు జై మోదీ, జై సర్, జైజై సంజయ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. మహా పాదయాత్రలో పాల్గొన్న మహిళల్లోనే పెద్ద ఎత్తున జోష్ కన్పించింది. పాదయాత్ర ఆద్యంతం డ్యాన్సులు వేస్తూ వడివడిగా అడుగులు వేస్తూ నితిన్ నబిన్ తో కలిసి పాదయాత్ర చేయడం కన్పించింది.

More Stories
నేపాల్‌లో అభివృద్ధి పనులకు రూ.24 వేల కోట్ల ప్యాకేజీ
జిన్‌పింగ్ తర్వాత అత్యంత సమర్ధుడైన నాయకుడిగా ప్రధాని మోదీ
రేవంత్ ‘పిచ్చి కుక్కలు కరిచిన ఎమ్మెల్యేలు’ వ్యాఖ్యతో రాజకీయ దుమారం