
తేజస్వి యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ గత సంవత్సరం కేసు నమోదు చేసింది. ఆ కాలంలో ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థుల నుంచి లాలూ ప్రసాద్ సంబంధీకులు తక్కువ ధరకే భూములను కొన్నారని సీబీఐ ఆరోపణల్లో ఉంది.
లాలూ ప్రసాద్, రబ్రీ దేవి సహా మరికొందరిని ఈ కేసులో చేర్చింది సీబీఐ. `ఉద్యోగంకు భూమి’ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందన్న ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ కూతుళ్లు, తేజస్వి యాదవ్ నివాసాలు, వారి అనుచరుల ఇళ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేసింది.
ఢిల్లీ, పట్నా, రాంచీ సహా మొత్తంగా 24 చోట్ల ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో మొత్తంగా రూ.70 లక్షల నగదు, 1.5 కేజీల బంగారు ఆభరణాలు, 540 గ్రాముల బులియన్ గోల్డ్, 900 అమెరికన్ డాలర్లతో పాటు మరికొంత విదేశీ కరెన్సీని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీ దేవిని సోమవారం పట్నాలో సీబీఐ విచారించింది. అనంతరం మరుసటి రోజే ఢిల్లీలో లాలూను ప్రశ్నించింది. అనంతరం మూడు రోజులకే ఈడీ సోదాలు జరిగాయి.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ