క్రీడాకారులు క్రీడల్లో సత్తా చాటాలని, ఎంచుకున్న క్రీడలో ప్రతిభ చాటి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చెప్పారు. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ పేరుతో సికింద్రాబాద్ పార్లమెంట్పరిధిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అమ్మాయిలు కిసీ సే కమ్ నహీ అన్నట్లుగా అద్భుతంగా ఆడారని ఆయన అభినందించారు.
గురువారం జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక విజన్తో క్రీడలకు సంబంధించి దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పోటీలు నిర్వహించాలని చెప్పారు. వారు ప్రధాని అయిన తర్వాత ఒలింపిక్స్ సహా ఇతర అంతర్జాతీయ పోటీల్లో మన దేశ క్రీడాకారులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని గుర్తు చేశారు.
మనం ప్రపంచంలో అనేక అంశాల్లో నెంబర్ వన్గా ఉన్నప్పటికీ క్రీడల్లో కొంత వెనకబడి ఉండే వాళ్లమని, కానీ మోదీ ప్రధాని అయిన తర్వాత ఒలింపిక్స్లో భారత క్రీడాకారులు మంచి ప్రతిభ సాధించారని తెలిపారు. తెలంగాణలో కూడా ప్రభుత్వంతో పాటు వ్యక్తులు, సంస్థలు క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
వారం రోజులపాటు దాదాపు 7 వేల మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారని చెబుతూ వారికి ముఖ్యంగా, అమ్మాయిలు, బాలికలను ప్రధాని మోదీ, తన తరఫున కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్ను గుర్తు చేసేలా క్రీడాకారులు వారి ప్రదర్శన చూపారని కొనియాడారు.
ఇదే స్ఫూర్తితో క్రీడాకారులు భవిష్యత్లో చివరి వరకు పోరాడాలిని కోరారు. క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అంతకు ముందు లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ రాజకీయం, ప్రజా జీవితం అంటే తిట్లు, శాపనార్థాలు కాకుండా.. యువతలో ఆరోగ్యకర పోటీ పెంచి క్రీడాస్ఫూర్తిని నింపేందకు అద్భుతమైన క్రీడాపోటీలు నిర్వహించారని అంటూ కిషన్ రెడ్డిని అభినందించారు.
ఆడపిల్లలు ఖోఖో అద్భుతంగా ఆడారని అంటూ అది చూసి తనకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినయని చెప్పారు. ఖోఖో, కబడ్డి లాంటి టీమ్ స్పిరిట్ ఆటలు పెట్టినందుకు కిషన్ రెడ్ని అభినందించారు.
బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్ రావు మాట్లాడుతూ అటల్ బిహారి వాజ్ పెయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆసియా గేమ్స్, క్రికెట్, ఒలింపిక్స్లో ఎక్కడైనా ఓ ఆట జరుగుతుందంటే.. గెలిచినా, ఓడినా.. మీకు నేను అండగా ఉన్నాను అని దేశ ప్రధాని మోదీ ధైర్యం చెబుతారని గుర్తు చేశారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 40 డివిజన్ల నుంచి యువత పోటీ పడ్డారు. 20 గ్రౌండ్స్ లో, 200 మంది రెఫరీస్ తో ఆటల పోటీలు నిర్వహించారు. పది వేల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటే మొత్తం 7,279 మంది ఆటల పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీలో 78 టీమ్స్, అథ్లెటిక్స్ లో 552 మంది ప్లేయర్స్, ఖోఖోలో 51 టీమ్స్, క్రికెట్లో 318 టీమ్స్, వాలీబాల్ లో 62 టీమ్స్ పోటీపడ్డాయి.

More Stories
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్
పహల్గమ్ దాడిలోని ఫోన్ కు పాక్ బ్యాంకుతో సంబంధం!
మరోసారి తెరపైకి జాతీయ జంతువుగా గోవు అంశం