ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో అక్కడి ప్రజలు బతకడం కష్టమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారం రోజులుగా నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. అనేక నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఇటీవల కాలంలో రుణాలు తీసుకుంటూ శ్రీలంక కొంతమేర ఆర్థికంగా పుంజుకుంటున్నా, పాకిస్తాన్ మాత్రం ఆ దేశం నుంచి ఇంకా గుణపాఠాలు నేర్చుకున్నట్లు కనిపించడం లేదు.
పాకిస్తాన్ ఆర్థిక మాంద్యం నుంచి పుంజుకోవడానికి రుణాలను తీసుకున్నా వాటినితిరిగి చెల్లించలేక అవస్థలు పడుతోంది. దాదాపు ప్రపంచంలోనే రుణ ఎగవేతకు దగ్గరలో ఉన్న అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో పాకిస్తాన్ ఐదో దేశంగా నిలవనుందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం 48 ఏళ్ల గరిష్టానికి చేరింది. దీంతో అక్కడి ప్రజల జీవనం కష్టతరమౌతుంది.
ఇక గతేడాది వరదల ప్రభావం అక్కడి ప్రజల పైనా, ఆర్థిక వ్యవస్థపైనా ఇప్పటికీ కొనసాగుతోంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఈ వారంలో పాక్ ప్రభుత్వం ఇంటరుేషనల్ మానిటరీ ఫండ్ నుండి 6.5 బిలియన్ డాలర్ల రుణం కోసం ప్రయతిుంచినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాదిలో జరగబోయే నేషనల్ అసెంబ్లీ ఎనిుకలు గందరగోళంగా మారే అవకాశముందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
గతంలో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ కానీ, ఇప్పుడును షెహబాజ్ షరీఫ్‌లు కానీ పాక్ అభివృద్ధి దిశగా ప్రయతాులు చేయకపోవడం ప్రజలు నిశితంగా గమనిస్తూనే ఉన్నారని ప్రముఖ మీడియా ఛానెల్ బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఆర్థికంగానూ, రాజకీయంగానే కాదు.. అక్కడ ఉగ్రవాదం కూడా పెచ్చరిల్లడం ఆ దేశాభివృద్ధికి పెను సమస్యగా దాపురించింది. ఇటీవల పెషావర్ నగరంలోని మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడివల్ల దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు.
‘పెరుగుతున్న ధరల ద్రవ్యోల్బణం వల్ల స్థానిక వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. ఈ శీతాకాలంలో తన రెస్టారెంట్‌లో సీ ఫుడ్స్ 50 శాతం మేర విక్రయాలు తగ్గాయి. ధరలు పెరగడం వల్ల మధ్యతరగతి కస్టమర్లు సీ ఫుడ్‌కి దూరంగా ఉంటున్నారు.’ అని ఓ రెస్టారెంట్ యజమాని చెప్పారు.

More Stories
యూకే పర్యటనలో గురుద్వారా సందర్శించిన మోహన్ భగవత్
ఆఫ్రికా పెద్దగా, గ్రీన్‌ల్యాండ్ చిన్నగా.. త్వరలో కొత్త ప్రపంచ పటం
నాగరిక సంభాషణను పెంపొందించేందుకే భగవత్ యుకె పర్యటన