ఆపై ఆయనకు బెయిల్ మంజూరైనా గుజరాత్ పోలీసులు పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన సొమ్మును గోఖలే స్వప్రయోజనాలకు వాడుకున్నారని గుజరాత్ పోలీసులు ఆరోపించిన నేపధ్యంలో ఈడీ ఆయనను అరెస్ట్ చేసింది. గత ఏడాది అక్టోబర్‌లో వంతెన కూలిన ఘటన చోటుచేసుకున్న మోర్బిని సందర్శించేందుకు ప్రధాని మోదీ రాగా, ఆ పర్యటనకు గుజరాత్ ప్రభుత్వం రూ . 30 కోట్లు ఖర్చు చేసిందని ఓ గుజరాతీ పత్రిక కధనాన్ని గోఖలే ట్వీట్ చేశారు. డిసెంబర్ 1న ఈ కథనాన్ని పీబీఐ తోసిపుచ్చుతూ ఇది ఫేక్ న్యూస్ అని నిర్ధారించింది.
ఈ వార్తను తాము ప్రచురించలేదని సదరు గుజరాతీ పత్రిక స్పష్టం చేసింది. దీంతో గోఖలేను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించిన సొమ్మును గోఖలే స్వప్రయోజనాలకు వాడుకున్నారని దీనిపై లోతైన దర్యాప్తు జరిపించాలని పోలీసులు కోరడంతో ఈడీ రంగంలోకి దిగింది.

More Stories
కేరళ సీఎం విజయన్‌కు ఈడీ నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై కొత్త ఎఫ్ఐఆర్
ఒకేసారి 6వేల విమానాలను రీకాల్ చేసిన ఎయిర్ బస్..!