లెబనాన్ రాజధాని బీరూట్లోని పోర్టు ప్రాంతంలో మంగళవారం సాయంత్రం జరిగిన రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఇందులో 78 మంది మరణించారని, 3700 మంది గాయపడ్డారని లెబనాన్ ప్రధాని హసన్ దియాబ్ ప్రకటించారు.
దేశంపై అణుబాంబు దాడి జరిగిందా? అనిపించేలా బ్రహ్మాండమైన పేలుళ్లు సంభవించాయి. తేరుకొని చూసేలోపు పెద్ద పెద్ద భవనాలు సైతం నేలమట్టమై, రక్తపు మడుగుల్లో మృతదేహాలు, కాపాడమంటూ వందలమంది ఆర్తనాదాలు తలెత్తాయి.
ఘటనాస్థలికి మైళ్ల దూరంలో ఉన్న ఇండ్ల కిటికి అద్దాలు, పైకప్పులు కూడా కూలిపోయాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. పేలుళ్ల ఘటనలో అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
పోర్టులో సుమారు 2750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతోనే ఈ భారీ ప్రమాదం సంభవించిందని ప్రధాని చెప్పారు. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండా ఓడరేవులో ఆరేండ్లుగా నిల్వచేస్తున్నారని, దీన్ని ఎరువులు, బాంబుల తయారీకి వినియోగిస్తున్నారని వెల్లడించారు.

More Stories
నిధుల కోసం గాంజా సాగు ప్రోత్సహిస్తున్న మావోయిస్టులు
భారత్లో తాలిబన్ తొలి దౌత్యవేత్త నియామకం
భారత మహిళల జట్టుకు తొలిసారి వన్డే ప్రపంచకప్ కైవసం