అయితే భద్రతా దళాలు కొట్టడం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బు తోనే ఆ బాలిక మృతి చెందిందని ఆ బాలిక బంధువు ఒకరు తెల్పడం గమనార్హం. అయితే ఆ బాలిక తల్లి వారి వాదనలను ఖండిస్తున్నారు. తన కుమార్తె మృతికి కారణం ఏమిటో అధికారులు అధికారికంగా తెలపడం లేదని ఆమె వాపోయారు.
ఆ బాలిక మృతి చెందిన 10 రోజుల తర్వాత, ఓ మారుమూల గ్రామంలో ఆమె మృతదేహాన్ని కుటుంభం సభ్యుల ప్రమేయం లేకుండానే అధికారులు ఖననం చేశారు. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్, సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
పోలీసుల దాడిలో ఏడుగురు గాయపడినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బలగాల దాడిలో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది.

More Stories
భారత్ రావాలంటే హసీనాను అప్పగించాలి.. బంగ్లా ప్రధాని షరతు!
హఫీజ్ సయీద్‌పై ప్రశంసలు.. భారత్‌పై విషం కక్కిన పాక్ మాజీ మంత్రి
అమెరికాలో తల్లిని, తమ్ముడిని కిరాతకంగా హతమార్చిన బాలుడు