బౌధ్ద మత గురువు దలైలామా తనకు ఆరోగ్యం బాగాలేదన్న వార్తలను కొట్టిపారేశారు. ఆయనే స్వయంగా మీడియా ముందుకొచ్చి తన ఆరోగ్యం గురించి తెలిపారు. కరోనా వ్యాప్తి అనంతరం ఈ రెండేళ్ల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా కనిపించిన దలైలామా శుక్రవారం తాను ఎంతో ఆరోగ్యంతో ఉన్నానని తెలిపారు.
ఇప్పుడు డాక్టర్తో బాక్సింగ్ కూడా ఆడగలనని స్పష్టం చేశారు. ఒక సభలో ప్రసంగిస్తున్నప్పుడు అతను జాతక కథల నుండి చిన్న బోధన కూడా చేశారు. దీని తర్వాత ప్రధాన టిబెటన్ దేవాలయం సుగ్లాఖాంగ్లో బోధిచిట్టా (సెమ్కీ)ని రూపొందించే కార్యక్రమం జరిగింది.
తాను రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం ఢిల్లీకి వెళ్లాల్సి ఉందని, అయితే ఆరోగ్యం బాగానే ఉన్న కారణంగా వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇప్పుడు డాక్టర్తో బాక్సింగ్ కూడా ఆడే ఫిట్నెస్తో ఉన్నానని అందుకే వెళ్లలేదని చెప్పారు.
సన్యాసులు, సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ (సిటిఎ) సభ్యులతో సహా వేలాది మంది టిబెటన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిటిఎ “చార్టర్ ఆఫ్ ది టిబెటన్స్ ఇన్-ఎక్సైల్” కింద పనిచేస్తోంది.
“ఇవ్వాల ఎంతో అద్భుతమైన రోజు. మేము రెండేళ్ల తర్వాత ఆయన పవిత్రతను చూడగలుగుతున్నాం. అత్యంత అదృష్ట విషయాలలో ఇది ఒకటి. ఆయన క్షేమంగా ఉన్నారని, ఆరోగ్యంగా ఉన్నారన్న వార్త తెలుసుకోవడం మా అందరికి చాలా సంతోసంగా ఉంది” అని సిటిఎ సభ్యుడు టెన్జింగ్ జిగ్మే ఆనందం వ్యక్తం చేశారు.

More Stories
పాకిస్థాన్ తో చర్చలకు కొన్ని మార్గాలు ఎప్పుడూ తెరిచే ఉండాలి
తిరుగుబాటు ఎంపీ కాకోలీ దస్తీదార్ కుమారుడు మమతపై దావా
ఆధునిక ప్రపంచ సవాళ్లకు భారత్ లో శాశ్వత పరిష్కారాలు