`అణు ఉగ్రవాదం’కు పాల్పడుతున్న రష్యా… అణుకేంద్రంపై దాడి 

`అణు ఉగ్రవాదం’కు పాల్పడుతున్న రష్యా… అణుకేంద్రంపై దాడి 

ఉక్రెయిన్ ను వీలైనంత వేగంగా లొంగదీసుకునేందుకు అణుపదార్థాలతో రష్యా చెలగాటమాడుతోంది. ఐరోపాలోనే అతి పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జపోరిజియా పై బాంబుల వర్షం రష్యా సైనికులు కురిపించారు. న్యూక్లియర్ ప్లాంట్ దగ్గర మంటలు చెలరేగడంతో.. ఆందోళన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

 ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక బృందాలు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపుచేశాయి. జపోరిజియా న్యూక్లియర్ ప్లాంటు రష్యా ఆధీనంలోకి వెళ్లినట్లు ప్రకటించింది ఉక్రెయిన్ ప్రభుత్వం. దాడులు జరిగిన కొన్ని గంటలకే న్యూక్లియర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. అయితే న్యూక్లియర్ ప్లాంటు దగ్గర రేడియేషన్ స్థాయి పెరగలేదని తెలిపింది. 

ఉక్రెయిన్‌లోని జాషోరియా అణు విద్యుత్‌ కేంద్రాన్ని రష్యా బలగాలు స్వాధీనం చేసుకోవడంపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం చేస్తూ రష్యా అణు ఉగ్రవాదంకు పాల్పడుతున్నట్లు మండిపడ్డారు.  ఈ సందర్భంగా 1986లో చోటుచేసుకున్న చెర్నోబిల్‌ విపత్తు గురించి ప్రస్తావిస్తూ.. ఈ ఘటన గురించి ప్రపంచ మొత్తానికి తెలుసునని, ఆ అణువిద్యుత్‌ కేంద్రం పేలుడు వల్ల ఎంత మంది చనిపోయారో, క్షతగాత్రులయ్యారో తెలుసునని గుర్తు చేశారు. 

ఆ పరిణామాలకు అనేక మంది బాధితులయ్యారని, అనేక మంది తరలించబడ్డారని చెబుతూ ఇదే రష్యా పునరావృతం చేయాలని కోరుకుంటుందని ఆరోపించారు. పునరావృతం చేసేందుకు సిద్ధమైందని, కానీ అలా జరిగితే.. చెర్నోబిల్‌ కన్నా.. ఆరు రెట్లు అధికమైన ఈ అణువిద్యుత్‌ కేంద్రం పేలితో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించారు. 

రష్యా ఈ అణు విద్యుత్‌ ప్లాంట్‌పై దాడికి పాల్పడిందని మండిపడ్డాయిరు. రష్యా దాడులను ‘న్యూక్లియర్‌ టెర్రర్‌’గా పేర్కొన్న ఆయన.. ఈ దాడులకు నిరసనగా ఆందోళనలు చేపట్టాలని ఉక్రెయిన్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను ఆయన కోరారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై జపాన్‌ ప్రధాని ఫ్యూమియో కిషిదాతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు.

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. పవర్ ప్లాంట్ పై దాడుల గురించి అమెరికా, బ్రిటన్, కెనడా ఆందోళన వ్యక్తం చేశాయి. అమెరికా అధ్యక్షుడు బైడన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్ లో మాట్లాడారు. న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి వల్ల ఐరోపా ఖండానికే ముప్పుం ఉందని బ్రిటన్ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి దారుణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఉక్రెయిన్ పై మిసైల్స్, రాకెట్లతో రష్యా దాడి కొనసాగిస్తోంది. తొమ్మిది రోజుల నుంచి ఇప్పటివరకు రష్యా మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడంలో రష్యా విజయవంతమైన,  ఉత్తర ప్రాంతాలో రష్యా సేనలను దీటుగా ఉక్రెయిన్ సైన్యం ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. 

మొత్తం మిసైల్స్ లో 230… ఉక్రెయిన్ లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా భూభాగం నుంచి 150, బెలారస్ నుంచి 70, బ్లాక్ సీ నుంచి నౌకల ద్వారా మరిన్ని ప్రయోగించినట్లు తెలిపింది. రష్యా దాడులను ఉక్రెయిన్ క్షిపణి విధ్వంసంక దళాలు దీటుగా ఎదుర్కొన్నాయని అమెరికా వివరించింది.