చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత బొడిగే శోభకు హైకోర్టులో ఊరట కలిగింది. రూ.25వేల పూచీకత్తుతో శోభను విడుదల చేయాలని పోలీసులను తెలంగాణ రాష్ట్ర హై కోర్టు ఆదేశించింది.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల విషయంలో ఉన్న జీవో నెంబర్ 317ను సవరించాలని జాగరణ దీక్ష చేపట్టిన సమయంలో బండి సంజయ్, బొడిగె శోభతో సహా మొత్తం 17 మంది ని కరోనా నిబంధనలు పాటించలేదని పోలీసులు అరెస్టు చేశారు
.అంతే కాకుండా జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఇటీవల బండి సంజయ్ జైలు నుంచి విడుదల అయ్యారు. తాజా గా బొడిగె శోభ కూడా తన రిమాండ్ ను రద్దు చేయాలని హై కోర్టులో అత్యవసన పిటిషన్ వేసింది.
ఈ పిటిషన్ పై హై కోర్టు విచారణ జరిపింది. బొడిగే శోభ రిమాండ్ పై స్టే విధించింది. అలాగే బొడిగె శోభ అరెస్టు గురించి పూర్తి వివరాలు హై కోర్టుకు సమర్పించాలని కరీంనగర్ పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ కేసు విచారణను వచ్చే నెల 7 తేదీకి వాయిదా వేసింది.

More Stories
తెలంగాణాలో అడ్డుకోవడంపై రాహుల్, ప్రియాంక స్పందించాలి
తెలంగాణ ఆవిర్భావోత్సవం.. రాష్ట్రపతి, ప్రధాని మోదీ శుభాకాంక్షలు
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజాద్రోహ పాలనపై బీజేపీ నేతల ఆగ్రహం