
హుబ్బళ్లిలో జరిగిన రెండు రోజుల రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ, “ప్రస్తుతం, రాష్ట్రంలోని హిందూ దేవాలయాలు వివిధ రకాల నియంత్రణ చట్టాలు, నిబంధనలలో ఉన్నాయి. అధికారుల చేతుల్లో చిక్కుకున్న దేవాలయాలను మా ప్రభుత్వం విముక్తి చేస్తుంది. ఆలయ నిర్వహణకు వారి స్వంత అభివృద్ధిని చూసుకునే హక్కును కల్పించే చట్టాన్ని మేము తీసుకువస్తాము” అని ప్రకటించారు.
“మన ఆలయాలను రాష్ట్ర నియంత్రణ నుండి విముక్తి చేయడానికి మేము తదుపరి అసెంబ్లీ సమావేశాలలో కొత్త బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నాము. పార్టీ సీనియర్ నేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాత త్వరలోనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటాము” అని వెల్లడించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందే కొత్త చట్టాన్ని సిద్ధం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.
“బడ్జెట్ సమావేశాలకు ముందు మన దేవాలయాలను ఆంక్షలు లేకుండా చేయడానికి చట్టం రూపొందిస్థాము. రాష్ట్రంలో ఎలాంటి నియంత్రణ లేదా నిబంధనలు లేకుండా ఆలయాలు స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతిస్తాం’’ అని ఆయన ప్రకటించారు.
హిందూ దేవాలయాల నిధులను ఇతర మత సంస్థలకు మళ్లించడాన్ని రాష్ట్ర, జిల్లా ధార్మిక పరిషత్ సభ్యులు వ్యతిరేకించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకుని, డిపార్ట్‌మెంట్ ‘తస్తిక్’ మొత్తం లేదా వార్షిక గ్రాంట్ల నుండి నిధుల విచలనాన్ని నిరోధించింది.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు