నటి జాక్వలిన్‌ ని ప్రశ్నించిన ఈడీ

బాలీవుడ్‌ నటి జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఆమెను రూ 200 కోట్ల   మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సుమారు ఐదు గంటలపాటు విచారించారు. ఈ విచారణ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సాగింది. 
 
ఈ కేసులో సూత్రధారిగా సుకేష్‌ చంద్రశేఖర్‌తో నటి జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌కు దగ్గరి సంబంధాలు ఉండటంతో ఈడీ అధికారులు ఆమెను విచారించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘ఈ కేసులో జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ నిందితురాలు కాదు. ఆమెను కేవలం ఈ కేసుకు సంబంధించి సాక్షిగా మాత్రమే విచారించాము’ అని ఈడీ వర్గాలు స్ఫష్టం చేశాయి. 
 
అయితే ఆమెను ప్రశ్నించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంత కీలక సమాచారం అందిందని తెలిపాయి. రూ 200 కోట్ల  మనీలాండరింగ్‌ కేసులో ఓ బాలీవుడ్‌ నటుడు కూడా ఉన్నారని, భద్రతా కారణాల రీత్యా ఆ నటుడి పేరు బహిరంగపరచలేమని కేంద్ర ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. 
 
ఆగస్టు 24న సుకేశ్‌ చంద్రశేఖర్‌కి సంబంధించిన 16 లగ్జరీ కార్లు.. సముద్రతీరంలోని ఓ విల్లాను ఆగస్టు 24న ఈడీ అధికారులు సీజ్‌ చేశారు. సుకేశ్‌ చంద్రశేఖర్‌పై గతంలోనూ ఎఫ్‌ఆర్‌ఐలు నమోదయ్యాయని ఈడీ తెలిపింది.