బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. ఆమెను రూ 200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు సుమారు ఐదు గంటలపాటు విచారించారు. ఈ విచారణ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సాగింది.
ఈ కేసులో సూత్రధారిగా సుకేష్ చంద్రశేఖర్‌తో నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్‌కు దగ్గరి సంబంధాలు ఉండటంతో ఈడీ అధికారులు ఆమెను విచారించారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘ఈ కేసులో జాక్వలిన్ ఫెర్నాండేజ్ నిందితురాలు కాదు. ఆమెను కేవలం ఈ కేసుకు సంబంధించి సాక్షిగా మాత్రమే విచారించాము’ అని ఈడీ వర్గాలు స్ఫష్టం చేశాయి.
అయితే ఆమెను ప్రశ్నించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంత కీలక సమాచారం అందిందని తెలిపాయి. రూ 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఓ బాలీవుడ్ నటుడు కూడా ఉన్నారని, భద్రతా కారణాల రీత్యా ఆ నటుడి పేరు బహిరంగపరచలేమని కేంద్ర ఏజెన్సీ వర్గాలు తెలిపాయి.
ఆగస్టు 24న సుకేశ్ చంద్రశేఖర్‌కి సంబంధించిన 16 లగ్జరీ కార్లు.. సముద్రతీరంలోని ఓ విల్లాను ఆగస్టు 24న ఈడీ అధికారులు సీజ్ చేశారు. సుకేశ్ చంద్రశేఖర్‌పై గతంలోనూ ఎఫ్‌ఆర్‌ఐలు నమోదయ్యాయని ఈడీ తెలిపింది.

More Stories
నీట్ ప్రశ్నలను లీక్ చేసిన ముగ్గురు ఎన్టీఏ సబ్జెక్ట్ నిపుణులు
బోఫర్స్ ముడుపుల ఆరోపణలకు సుప్రీంకోర్టు ముగింపు
రూ.3.25లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు