26 జనవరి 2017లో విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా కోసం ర్యాలీ చేయడానికి ప్రజాసంఘాల సిద్ధమయ్యాయి. అప్పట్లో తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరుగుతుండడంతో ఆ స్పూర్తితో అందరూ ముందుకు రావాలని సోషల్ మీడయాలో విస్తృతంగా ప్రచారం చేశారు.
అయితే చివరివరకు స్పందించకుండా ఉన్న వైసీపీ.. ఉద్యమానికి మంచి స్పందన వచ్చేసరికి జగన్, విజయసాయితో పాటు ముఖ్యనేతలు హైదరాబాద్లో విమానం ఎక్కి విశాఖలో దిగారు. అయితే అప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. తర్వాత రోజు అంటే 2017 జనవరి 27వ తేదీ నుంచి విశాఖలో పెట్టుబడుల సదస్సు ఉండడంతో నిరసనలపై పోలీసులు ఉక్కపాదం పోపారు.
విమానాశ్రయంలోను జగన్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎయిర్పోర్టులో జగన్, విజయసాయి రచ్చరచ్చ చేశారు. పోలీసులను తోచేశారు. తాము అధికారంలోకి వచ్చాక సంగతి చూస్తామని హెచ్చరించారు. ఈ ఘటనలో విజయసాయి చాలా దూకుడుగా వ్యవహరించారు.
ఆయన పోలీసులను తోచేస్తున్న వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తానే పోలీసులపై దురుసుగా ప్రవర్తించి.. తనపైనే దాడి చేశారంటూ ఎంపీ హోదాలో రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రివిలేజ్ కమిటీ ఆయన తప్పుడు ఫిర్యాదు చేశారని తేల్చింది. ఆయనపై దాడికి ఆధారాలు లేవని తెలిపింది.

More Stories
ఎపిలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ
రేణిగుంట, మదనపల్లెలలో వాజ్పేయీ కాంస్య విగ్రహాలు
ధనుర్మాసంలో తిరుమలలో సుప్రభాతం స్థానంలో తిరుప్పావై