సాహితీ, సాంస్కృతిక, కళారంగాల్లో సుపరిచితులైన ఇటీవల కన్నుమూసిన బోడె ఆంజనేయరాజు అజాతశత్రువుగా, కళాభిమానిగా, కళాపోషకుడిగా, అందరితో ఆత్మీయ సంబంధాలు కలిగి ఉన్న మంచి మనిషిగా పలువురు ప్రముఖులు కొనియాడారు. విజయవాడలోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయం మినీ ఆడిటోరియంలో సుమధుర కళానికేతన్, దృశ్యవేదిక సంయుక్తంగా సంతాప సభనలో ఆంజనేయరాజు ప్రముఖ సాహితీ, సాంస్కృతిక సంస్థ ఎక్స్-రే ప్రధాన కార్యదర్శిగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు.
దశ్యవేదిక అధ్యక్షుడు అంబటి మధుమోహన్ కృష్ణ మాట్లాడుతూ, ఆంజనేయరాజు పలు సాహితీ, సాంస్కృతిక సంస్థల్లో సభ్యుడిగా ఉండటమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొనేవారని తెలిపారు. సుమధుర కళానికేతన్ కార్యదర్శి పి.వి. భాస్కరశర్మ మాట్లాడుతూ, ఆంజనేయరాజు అందరితో స్నేహపూర్వకంగా, ఆత్మీయంగా మెలిగేవారని గుర్తుచేసుకున్నారు.
సుమధుర కళానికేతన్ అధ్యక్షుడు సామంతపూడి నరసరాజు మాట్లాడుతూ, సాహితీ, కళారంగాలకు చెందిన పలువురి హృదయాల్లో ఆంజనేయరాజు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. తొలుత ఆంజనేయరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించారు.
సభకు బొర్రా నరేన్ అధ్యక్షత వహించగా, అనిల్, రఘు, ఎల్.ఎస్.ఆర్.కె. ప్రసాద్, రుద్రరాజు సత్యనారాయణ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. హేమాద్రి ప్రసాద్ వి.ఆర్.ఎస్. కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు.

More Stories
ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ప్రభంజనం
తీరం దాటిన మురసు తుఫాన్.. 110కి.మీ వేగంతో ఈదురుగాలులు!
టీటీడీకి ముగ్గురు ఉన్నతాధికారులతో ‘స్పెసిఫైడ్ అథారిటీ’