చంద్రబాబు రాజధాని కట్టకపోవడం వల్లే అమరావతి ఉద్యమం తెరపైకి వచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గుంటూరు లో పేర్కొన్నారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని మరోసారి స్పష్టం చేశారు.
రాజధాని కోసం 365 రోజులుగా రైతులు, మహిళలు, వృద్ధులు రోడ్డెక్కి పోరాడుతున్నారని చెబుతూ అమరావతి లాంటి ఉద్యమం ప్రపంచంలో ఎక్కడా లేదని కొనియాడారు. 105 మంది రైతులు దిగులుతో ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతియుత పోరాటం చేస్తున్న రైతులను భయబ్రాంతులకు గురిచేయొద్దన్నారు. ‘ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని’ నినాదంతో రైతులు ముందుకు సాగుతున్నారని తెలిపారు.
జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతందని విమర్శించారు. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఈఆలోచనలను విరమించుకోవాలని సోము వీర్రాజు హితువు పలికారు.

More Stories
బ్రిటన్లో తొలి ఏఐ మంత్రిగా భారత సంతతి కనిష్క నారాయణ్
విదేశీ విద్యార్థులు సెప్టెంబర్ 15కు తిరిగి అమెరికా వచ్చేయాలి
ఉక్రెయిన్ ఓడరేవు నౌకపై దాడిలో నలుగురు భారతీయులు మృతి