* బ్రిక్స్ కు జిన్‌పింగ్ బీజింగ్ నుండి బయలుదేరేముందు చైనా సందేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, న్యూఢిల్లీలో జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు శనివారం బీజింగ్ నుండి బయలుదేరారని జిన్హువా నివేదించింది. అధ్యక్షుడు షీ శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు షీ వెంట ఉన్న బృందంలో, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు, సీపీసీ సెంట్రల్ కమిటీ జనరల్ ఆఫీస్ డైరెక్టర్ అయిన కై కీ, చైనా విదేశాంగ మంత్రి, సీపీసీ సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అయిన వాంగ్ యీ ఉన్నారని చైనా వార్తా సంస్థ తెలిపింది.
ఒక జిన్హువా నివేదిక ప్రకారం, బిక్షెక్‌లో జరిగిన ఎస్సిఓ సదస్సులో చేసిన విధంగానే, బ్రిక్స్ సదస్సులో కూడా జిన్‌పింగ్ గ్లోబల్ సౌత్ సహకారంపై ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంది. బ్రిక్స్, ఎస్సిఓ అనే రెండు కూటములు తమ సభ్యత్వాన్ని, అభివృద్ధి చెందుతున్న భాగస్వాముల నెట్‌వర్క్‌లను విస్తరించుకున్నాయని ఆ నివేదిక పేర్కొంది. వాటి సభ్యులు కలిసి ప్రపంచ జనాభాలో సగానికి పైగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సుమారు 30 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇటీవలి దౌత్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నందున, ప్రతిపాదిత మోదీ-షి జిన్‌పింగ్ సమావేశాన్ని నిశితంగా గమనించే అవకాశం ఉంది. షి, మోదీల మధ్య ద్వైపాక్షిక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి చైనా, భారత్ కృషి చేస్తున్నాయని, దీనితో ఇద్దరు నాయకులు వరుసగా మూడవ సంవత్సరం ముఖాముఖిగా కలుసుకోవడం ఖాయమవుతుందని భారతదేశంలో చైనా రాయబారి జు ఫీహాంగ్ తెలిపారు.
ఇద్దరు నాయకులు గతంలో 2024లో రష్యాలోని కజాన్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా, 2025లో షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా చైనాలోని టియాంజిన్‌లో మళ్లీ కలుసుకున్నారు. జిన్‌పింగ్ రాకకు ముందు, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను సరిగ్గా నిర్వహించాల్సిన అవసరం ఉందని అంగీకరిస్తూనే, భారత్‌తో సంబంధాలను వ్యూహాత్మక, దీర్ఘకాలిక దృక్పథంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు బీజింగ్ సంకేతాలు ఇచ్చింది.
2020 తూర్పు లడఖ్ ప్రతిష్టంభన అనంతరం భారత్-చైనా సంబంధాల స్తబ్దత తర్వాత, వాటిని సాధారణీకరించే ప్రయత్నాల నేపథ్యంలో షీ పర్యటన జరగడం విశేషం.
ఆగస్టు 25న బీజింగ్‌లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల 25వ విడత చర్చల సందర్భంగా, సరిహద్దుల నిర్ధారణ, సరిహద్దు నిర్వహణలో త్వరితగతిన, గణనీయమైన ఫలితాలను సాధించడంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, చైనాలు ఎనిమిది అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చాయి.

More Stories
104 మంది సిక్కు యాత్రికుల భారత్ యాత్రను అడ్డుకున్న పాక్
బహ్రెయిన్‌లోని అమెరికా నేవల్ సపోర్ట్ యాక్టివిటీ ధ్వంసం
మహిళల ఆసియా కప్‌లో పదో సారి ఫైనల్‌కు భారత్