లక్షలాది మంది నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిన రూ. వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, సామాన్య ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్న వివాదాస్పద ‘22ఏ’ నిషేధిత భూముల జాబితా అంశం, ఉద్యోగుల సమస్యలైన పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలుతో పాటు.. రాష్ట్ర ఆర్థిక, సామాజిక సంక్షోభాలపై సభలో చర్చించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందని స్పష్టం చేశారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని అరాచకాల నుంచి విముక్తిని, మార్పును కోరుకుని ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగిస్తే పోయిన బీఆర్ఎస్ లాగే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా ప్రజాద్రోహ విధానాలను అవలంబిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక తీవ్ర సమస్యలకు మూలకారణం గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలేనని నిలదీశారు. తమ పాపాలు, వైఫల్యాలు, అసమర్థత బయటపడకుండా ఉండేందుకు ఇరుపార్టీలు అసెంబ్లీని పక్కదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు.
పరస్పర బూతుల తిట్ల పురాణంతో, కేవలం టీఆర్పీలు, కెమెరా పబ్లిసిటీ స్టంట్ల కోసమే సభా సమయాన్ని వృధా చేస్తూ కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వెల్‌లో బీజేపీ పక్షాన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 22ఏ నిషేధిత భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మానాలను కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ అడ్డుకున్నాయని రాంచందర్ రావు గుర్తుచేశారు.

More Stories
మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి తిరస్కరించిన శారద!
బిఆర్ఎస్ ఎంఎల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సస్పెండ్
నీటి వాటాలపై ఏపీ-తెలంగాణ హోరాహోరీ