2023 ఆగస్టులో ఆ అంశం వెలుగులోకి వచ్చింది. రెండు సంస్థల మధ్య అధికారిక ఒప్పందం ఉన్నప్పటికీ, అవి మోసపూరితంగా ఉన్నాయని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) అభియోగాలు నమోదు చేసింది. 2017 నుంచి 2020 మధ్యలో సీఎంఆర్ఎల్ నుంచి రూ.1.72 కోట్లు పొందినట్లు ఆ ఆరోపణల సారాంశం. సీఎంఆర్ఎల్ తన 15 ఏళ్ల కాలంలో దాదాపు రూ.182 కోట్ల మేర కల్పిత నగదు ఖర్చులు చూపించి వివిధ వ్యక్తులకు లంచాలు ఇచ్చినట్లు ఎస్ఎఫ్ఐఓ ఆరోపించింది. అలాగే సీఎంఆర్ఎల్ ప్రమోటర్ ఎస్.ఎన్. శశిధరన్ కర్త, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు రవాణా సేవల పేరుతో రూ.91 కోట్లు చెల్లించినట్లు అందులో పేర్కొంది.
ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఎస్ఎఫ్ఐఓకు కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. ఈ కేసు విషయంలో వీణపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేసింది. గతంలో, 2012-13 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య సీఎంఆర్ఎల్ తన ఖర్చులను రూ.133.82 కోట్ల మేర పెంచి చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రవాణా, వ్యర్థాల నిర్వాహణ పేరిట ఖాతాల్లో బోగస్ నగదు ఖర్చులు నమోదు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అంతేకాదు, ఈ విధంగా సృష్టించిన నగదును రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు అక్రమ చెల్లింపుల కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, అలాగే సంస్థ మూసివేత, పర్యావరణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొనేందకు ఇటువంటి నగదు చెల్లింపులు చేసినట్లు సీఎంఆర్ఎల్ సీఎఫ్ఓ, ఎండీ ఆదాయపు పన్ను అధికారుల ఎదుట అంగీకరించినట్లు కోర్టు పత్రాలు వెల్లడిస్తున్నాయి. కాగా, తన కుమార్తెపై ఈడి కేసు నమోదు చేయడాన్ని రాజకీయ కక్ష సాధింపుగా విజయన్ గతంలో అభివర్ణించారు. ఈ కేసును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటామని రియాస్ కూడా గతంలో పేర్కొన్నారు.

More Stories
అధికారమే లక్ష్యంగా 18 నుండి పంజాబ్లో బీజేపీ నాలుగు యాత్రలు
అమెరికాలో నిల్వ చేసిన టన్నుల కొద్దీ బంగారం ఐరోపాకు తరలింపు
ఎర్రకోట పేలుడు సూత్రధారి ఉమర్ ఉన్ నబీ .. ఎన్ఐఏ ఛార్జిషీట్