ఏపీలో 15 ఏళ్లుగా టీడీపీ, వైసీపీ చుట్టూనే రాజకీయం తిరుగుతోందని, ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఏపీలో టీడీపీ రెడ్‌బుక్ పాలన కొనసాగిస్తుండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీ రప్పా రప్పా పార్టీలను నడిపిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ , వైసీపీ పార్టీలు రాష్ట్రానికి చేసిందేమి లేదని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని రెండు రాజకీయ పార్టీలే పాలించాలా, రెడ్డు, కమ్మలే సీఎంలు కావాలా? అని ప్రశ్నించారు.
త్వరలో తాను రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నయంగా రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలిపారు. ఏపీలోని ఆరు కోట్ల ప్రజానీకాన్ని, రాష్ట్ర సంపదను ఏ పార్టీ దోచుకోవాలనే హక్కు కోసం ఈ రెండు పార్టీలు కృషి చేస్తున్నాయని విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలు ఫ్యాక్షన్ కుటుంబ రాజకీయ పార్టీలని విమర్శించారు. వీరిద్దరి అజెండా ఒక్కటేనని ప్రజలకు గోరంత… తమకు కొండంత అనే విధంగా వ్యవహారిస్తాయని విజయ సాయిరెడ్డి విమర్శించారు.
ఇక తమ పార్టీలో 66 శాతం పదవులు యువతకే కేటాయిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోలియంపై జీఎస్టీని 15 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డీఎస్సీ, ఏపీపీఎస్సీలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి అనుమానాలు నివృత్తి కావాలంటే ఈ కేసులను సీబీఐకు అప్పగించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.

More Stories
లండన్ జాబ్స్ పేరిట ఘరానా మోసం.. యూట్యూబర్ నందన అరెస్ట్
ఏపీలో రూ.419 కోట్ల పర్యాటక ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
విజయవంతంగా ఈవోఎస్-05 ఉపగ్రహ ప్రయోగం