భారత నౌకాదళానికి మరో అదనపు శక్తి చేకూరనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ నిపుణ్ ఆగష్టు 31న, ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో నావికాదళంలో చేరనుంది. ఇది దేశీయంగా రూపొందిన రెండో డైవింగ్ సపోర్ట్ వెస్సెల్ (డీఎస్వీ). ఐఎన్ఎస్ నిపుణ్ నౌక పొడవు 118 మీటర్లు కాగా, ఇది సుమారు 8,560 టన్నుల బరువు (డిస్ప్లేస్మెంట్) కలిగి ఉంటుంది.
అప్పటికే పూర్తిస్థాయి నిర్మాణం, ట్రయల్స్ పూర్తి చేసుకుంది. ప్రధానంగా సముద్ర అంతర్భాగంలో కార్యకలాపాల కోసం ఈ నౌకను రూపొందించారు. ఆధునిక డైవింగ్ సిస్టమ్‌తో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది డీప్ సీ శాచురేషన్ డైవింగ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందుకోసం ఓ వైపు డైవింగ్ స్టేజ్‌ను ఏర్పాటు చేశారు. ఇది నీటిపైనే తేలియాడుతుంది.
కానీ, ఇందులోని డైవర్లు, ఆధునిక రోబోలు, రెస్క్యూ వెహికల్స్ వంటివి అత్యవసర పరిస్థితుల్లో సముద్రంలో డైవింగ్ చేసే సిబ్బందికి సాయం చేయగలదు. వైద్య సాయం అందించగలదు. సబ్మెరైన్లను రక్షించే చర్యల్లో పాల్గొని, సబ్మెరైన్లకు అండగా ఉంటుంది. నీటిపైన ఉంటూనే, సముద్రం లోపల సాయం అందించడంలో సాయపడుతుంది.

More Stories
హెచ్1ఎన్1 వైరస్ తోనే 98 శాతం శ్వాసకోశ వ్యాధులు
హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరేం కాదు
శతాబ్దానికిపైగా ఎన్నడూ లేనంతగా ఎల్‌నినో ప్రభావం