కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భూ దందాలు, సెటిల్‌మెంట్ల రాజ్యం

కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో భూ దందాలు, సెటిల్‌మెంట్ల రాజ్యం
* ఓటర్ల జాబితాప్రక్షాళణపై ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న సీఎం రేవంత్ 

గత బీఆర్ఎస్ పాలనలో ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలను సముద్రంలో పడేస్తామని చెప్పిన కాంగ్రెస్, ఇప్పుడు ‘భూభారతి’ పేరుతో అంతకంటే తీవ్రమైన దోపిడీకి పాల్పడుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సుమారు 4 లక్షల ఎకరాల భూములను రాత్రికి రాత్రే అక్రమంగా 22ఏ (నిషేధిత జాబితా) లోకి చేర్చారని మండిపడ్డారు.