వీసా ఆన్ అరైవల్ లేదా వీసా మినహాయింపు సౌకర్యం పొందే పర్యాటకులు ఆర్థిక నిధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇమ్మిగ్రేషన్ తనిఖీ సమయంలో ప్రతి పర్యాటకుడు కనీసం 20,000 థాయ్ బాట్ అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 58,000 నగదును తమ వెంట ఉంచుకోవాలని స్పష్టం చేసింది. తగినంత డబ్బు లేకపోతే అధికారులు ప్రవేశాన్ని నిరాకరించే అవకాశం ఉందని పేర్కొన్నది.
అలాగే ప్రయాణ ఉద్దేశ్యానికి తగిన వీసాను ముందుగానే తీసుకోవడం ఉత్తమం అని సూచించింది. ఉద్యోగం కోసం వెళ్లేవారు పర్యాటక వీసాలపై వెళ్లడం చట్టవిరుద్ధం అని హెచ్చరించింది. అటువంటి వారు ఖచ్చితంగా వర్కింగ్ వీసాను మాత్రమే పొందాలని సూచించింది. ట్రాన్సిట్ ప్రయాణికులు కూడా తమ తుది గమ్యస్థానానికి సంబంధించిన పత్రాలను, అవసరమైన వీసాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది.
ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దగ్గర అడిగే ప్రశ్నలకు పక్కాగా సమాధానాలు చెప్పేలా సిద్ధంగా ఉండాలని, ప్రయాణానికి సంబంధించిన అన్ని పత్రాలను డిజిటల్ కాపీలతో పాటు ప్రింట్ అవుట్ తీసి ఉంచుకోవడం వల్ల ఏ సమయంలోనైనా చూపడానికి సులభంగా ఉంటుందని సూచించింది. పర్యాటక వీసా అంటే కేవలం విహారయాత్ర కోసం మాత్రమే అని గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు లేదా దేశం నుంచి వెనక్కి పంపే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది.

More Stories
పీఓకెలో 600 మందికి పైగా అరెస్ట్…. భారీగా పాక్ వ్యతిరేక నిరసనలు
ఉద్విగ వాతావరణంలో అయతొల్లా ఖమేని అంత్యక్రియలు
హర్మూజ్ జలసంధిలో కొత్తగా ఇరాన్ ‘సర్వీస్ ఫీజు’