పశ్చిమ బెంగాల్ రాష్ట్రవ్యాప్తంగా తొలిసారిగా పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ యోగా డేలో వేలాది మంది పాల్గొన్నారు. ఉదయం 6:30 గంటలకే ఈ కార్యక్రమానికి చేరుకున్న మోదీ యోగా కేవలం వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరచడానికే కాదని, ప్రపంచ భవిష్యత్ కోసం కూడా అవసరమంని చెప్పారు.
“వయస్సు పెరిగినంత మాత్రాన మనిషి సామర్థ్యం తగ్గిపోదు. 50 ఏళ్ల వయస్సులో 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉత్సాహంగా ఉండాలి. 70 ఏళ్ల వయస్సులో 50 ఏళ్ల కంటే ఎక్కువ వ్యాధులను ఎదుర్కోగలగాలి. అందుకు యోగా ఉపయోగపడుతుంది. యోగా మన శరీరం, మనస్సును అర్థం చేసుకునే జీవితకాల అధ్యయనం లాంటిది” అని మోదీ పేర్కొన్నారు.
యోగా అనేది ప్రపంచాన్ని భారతదేశంతో అనుసంధానించిందని, ఇది మనుషులను ఒక్కటి చేస్తుందని ప్రధాని చెప్పారు. జూన్ 21 ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా మారిందని చెప్పారు. స్వామీ వివేకానంద, రవింద్రనాథ్ ఠాగూర్, శ్రీ అరబిందో వంటి మహనీయులు పుట్టిన గడ్డపై యోగా కార్యక్రమంలో పాల్గొనడం గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి ఇస్తోందని ప్రధాని తెలిపారు.
భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ప్రస్తావిస్తూ యోగా కేవలం శారీరక వ్యాయం కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా మార్గం చూపుతుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కూడా నేర్పుతుంది అని చెప్పారు. ప్రపంచ శాంతి, మానవ సంక్షేమానికి యోగా దోహదపడుతుందని చెప్పారు. యోగా కేవలం ఒక్కరోజు కార్యక్రమంగా మిగిలిపోకూడదని, మన జీవితంలో ఒక భాగం కావాలని మోదీ పిలుపునిచ్చారు.

More Stories
అయోధ్య అంశాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం
భగవంత్ మాన్ హాజరు వీడియోను విడుదల చేసిన అకల్ తఖ్త్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షునిగా మొదటిసారి భారతీయ అధికారి అగర్వాల్