మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో పాక్ పై ఘన విజయం

మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో పాక్ పై ఘన విజయం

మహిళల వన్డే వరల్డ్‌ చాంపియన్‌ భారత్‌ టీ20 ప్రపంచ కప్‌ను పాక్‌పై   అద్భుత విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్‌లో వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68), బౌలింగ్‌లో దీప్తి శర్మ (5/10), తెలుగమ్మాయి శ్రీచరణి (3/21) విజృంభించడంతో ఆదివారం జరిగిన గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో టీమిండియా 64 రన్స్‌ తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. 

టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుతనిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు సాధించింది.మంధానతో పాటు హర్మన్‌ప్రీత్‌ (35 బంతుల్లో 4 ఫోర్లతో 36), రిచా ఘోశ్‌ (17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 34 నాటౌట్‌) సత్తా చాటారు. పాక్‌ బౌలర్లలో కెప్టెన్‌ ఫాతిమా సనా (2/33), సాదియా ఇక్బాల్‌ (2/41) రెండేసి వికెట్లు తీశారు.  అనంతరం దీప్తి, చరణి స్పిన్‌ వలలో చిక్కిన పాక్‌ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ మునీబా అలీ (41) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు.

దీప్తి శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. 17న జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్‌ తలపడుతుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌‌ల్లో పూర్తి సాధికారత ప్రదర్శించిన భారత్‌ ‌ పాకిస్తాన్‌‌ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ఈ మ్యాచ్‌‌లో ముందుగా టాస్‌ ‌గెలిచిన బ్యాటింగ్‌‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

స్మృతి మంధాన (68; 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (36; 35 బంతుల్లో) రాణించారు.  చివర్లో రిచా ఘోష్‌ (34; 17 బంతుల్లో) దూకుడుగా ఆడడంతో భారత్‌ ‌భారీ స్కోరు నమోదు చేసింది. ఈ తరువాత లక్ష్యఛేదనకు పాకిస్థాన్‌ దీప్తి శర్మ (5/10) స్పిన్ మాయాజాలానికి 106 పరుగులకే కుప్పకూలింది.

ఆ జట్టులో ఓపెనర్ మునీబా అలీ (41; 35 బంతుల్లో 5 ఫోర్లు) టాప్ స్కోరర్. గుల్ ఫెరోజా 12, అయేషా జాఫర్ 12, అలియా రియాజ్ 12 పరుగులు చేశారు. శ్రీ చరణి 3, షెఫాలి వర్మ ఒక వికెట్ పడగొట్టారు.  బ్యాటింగ్‌‌లోనూ 12 పరుగులతో రాణించిన దీప్తి శర్మ ప్లేయర్‌ ఆఫ్‌ ‌ది మ్యాచ్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌‌లో ముందుగా బ్యాటింగ్‌ దిగిన భారత్‌‌కు తొలి ఓవర్‌‌లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్‌ ‌షెఫాలీ వర్మ ( 6) త్వరగా నిష్క్రమించింది. ఈ తరువాత వచ్చిన రోడ్రిగ్జ్‌ (1) కూడా ‌నిరాశపర్చింది. 

ఈ దశలో ఓపెనర్‌ స్మృతి మంధానకు జత కలిసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జోడీ దాటిగా ఆడింది. నాలుగు వికెట్‌‌కు కీలకమైన 91 పరుగులు జోడించింది. తరువాత మంధాన నాలుగో వికెట్‌‌గా వెనుతిరిగినా రిచా ఘోష్‌ ‌దాటికి భారత్‌ ‌స్కోరు 150 దాటింది. భారత్‌ ఇన్నింగ్స్ ముగిసేసరికి దీప్తి శర్మ- శ్రియింకా పాటిల్‌ ‌జోడి అజేయంగా నిలిచారు.

సంక్షిప్త స్కోర్లు

భారత్‌ : 20 ఓవర్లలో 170/6 (స్మృతి మంధాన 68, హర్మన్‌ప్రీత్‌ 36, రిచా ఘోష్‌ 34; ఫాతిమా సనా 2/33, సాదియా ఇక్బాల్‌ 2/41);

పాకిస్థాన్‌: 17 ఓవర్లలో 106 ఆలౌట్‌ (మునీబా 41, దీప్తి శర్మ 5/10, శ్రీచరణి 3/21)

అత్య‌ధిక వికెట్లతో దీప్తి రికార్డు 

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ తొలి మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన దీప్తి అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా అవ‌త‌రించింది. బ‌ర్మింగ్‌హ‌మ్‌లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్లు తీసిన ఈ ఆల్‌రౌండ‌ర్  166 వికెట్ల‌తో థాయ్‌లాండ్ బౌల‌ర్ థిప‌ట్చా పుథ్త‌వాంగ్ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టింది. నిఖార్సైన ఆల్‌రౌండ‌ర్‌గా భార‌త జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క‌మవుతున్న దీప్తి శ‌ర్మ ఇంగ్లండ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల‌తో  అత్య‌ధిక వికెట్ల రికార్డు సొంతం చేసుకుంది.

పాక్ టాపార్డ‌ర్‌ను కూల్చి భార‌త్‌కు అదినూ విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన త‌ను అంత‌ర్జాతీయ టీ20ల్లో 166 వికెట్ల‌తో అగ్ర‌స్థానం ద‌క్కించుకుంది. ప్రస్తుతానికి థాయ్‌లాండ్ బౌల‌ర్ థిప‌ట్చా పుథ్త‌వాంగ్ రెండో స్థానంలో ఉంది. 160 వికెట్ల‌తో రువాండా క్రికెట‌ర్ హెన్‌రియెట్టె ఇషిమ్వే, మేగ‌న్ ష‌ట్‌(ఆస్ట్రేలియా) 152 వికెట్ల‌తో, ఒన్నిచా కంచోంపు(థాయ్‌లాండ్‌) 148 వికెట్లు వ‌ర‌స‌గా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.