“ప్రస్తుతానికి ఆర్బీఐ అంచనాలను సందేహించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వారు వెల్లడించిన గణాంకాల విషయంలో వృద్ధి పెరిగే లేదా తగ్గే అవకాశాలు రెండూ ఉన్నాయి. కాబట్టి, ఆర్బీఐ అంచనా సూచించినట్లుగా వృద్ధి రేటు 7 శాతం కంటే తగ్గినా సరే స్థూల ఆర్థిక స్థిరత్వ చర్యలు, సరఫరా భరోసా చర్యలు మనల్ని బాహ్య పరిస్థితులు మెరుగుపడిన వెంటనే తిరిగి 7 శాతం కంటే ఎక్కువ వృద్ధి బాటలోకి తీసుకువస్తాయి. ఒకవేళ ప్రస్తుత పరిస్థితులే ఇలానే కొనసాగితే, మేము తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనాలను పునఃపరిశీలిస్తాము” అని ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు.
కాగా, భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదుకావడం, అదే ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదు కావడం భారత ఆర్థిక వ్యవస్థలోని అంతర్గత బలాన్ని ప్రతిబింబిస్తోందని ఎక్స్ వేధికగా పేర్కొన్నారు.
ఈ వృద్ధి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల ఫలితమని, అలాగే 140 కోట్ల మంది భారతీయుల కృషికి నిదర్శనమని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధిలో ప్రజల పాత్ర అత్యంత కీలకమని ఆయన తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు ‘ఈజ్ ఆఫ్ లివింగ్’, వ్యాపారాలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. దేశాన్ని మరింత వేగంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం ఎలాంటి అవకాశాన్నీ వదులుకోదని మోదీ పేర్కొన్నారు.

More Stories
మహారాష్ట్రలో రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ
రెండోసారి యధావిధిగా ఆర్బీఐ వడ్డీ రేట్లు
రాజేష్ ఎక్సపోర్ట్స్ రూ.15 లక్షల కోట్ల మాయాజాలం