
భారతీయ జనతా పార్టీ ర్యాలీపై శనివారంనాడు కొందరు అగంతకులు బాంబులు రువ్వుతూ, కాల్పులు జరిపారు. పశ్చిమబెంగాల్లోని అసంసోల్‌లో ఈ ఘటన చేటుచేసుకుంది. కాల్పుల్లో గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. బరబనీ ప్రాంతంలో ర్యాలీకి హాజరైన కొందరిని టార్గెట్ చేసుకుని అగంతకులు క్రూడ్ బాంబులు విసిరి, కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
రాజకీయ హింసకు పాల్పడటం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు విపక్షాలను బెదిరించాలని అనుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఘటన నేపథ్యంలో పోలీసులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఘటనా స్థలి వద్ద నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల కళ్ల ముందే గూండాలు బాంబులు విసరడం, బుల్లెట్లు పేల్చడం ఒక్క బెంగాల్లో మాత్రమే జరుగుతుందని ఆయన విమర్శించారు. మరోవైపు, విపక్షాల ఆరోపణలను టీఎంసీ ప్రతినిధి కునల్ ఘోష్ తోసిపుచ్చారు. బీజేపీలో అంతర్గత విభేదాలే ఘర్షణలకు కారణమని, అధికార పార్టీ (టీఎంసీ) ప్రమేయం ఏమీ ఇందులో లేదని చెప్పారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు