* పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పెట్రోల్ లేదు!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరంగా మారుతున్న వాయు కాలుష్యానికి అడ్డుకట్ట వేసేందుకు ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్’ (సీఏక్యూఎమ్) రెండు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఎన్సీఆర్ పరిధిలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించడంలో భాగంగా ఇకపై కేవలం ఎలక్ట్రిక్ ఆటోలను (ఎల్5 కేటగిరీ ఇ-ఆటోలు) మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేసింది.
దీనితో పాటు చెలామణిలో ఉన్న వాహనాల కాలుష్య నియంత్రణపై నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ దాని చుట్టుపక్కల జిల్లాల్లో పాత ఇంధన ఆటోల స్థానంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశ పెట్టేందుకు కమిషన్ ఒక స్పష్టమైన కాల పరిమితిని ప్రకటించింది. 2027 జనవరి 1వ తేదీ నుంచి మొదటి దశలో భాగంగా, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (ఎన్సీటీ) నిబంధన అమలులోకి వస్తుంది.
దీని తర్వాత ఇక్కడ కేవలం ఇ ఆటోలకే రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తారు. రెండో దశ 2028 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుండగా, వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఎన్సీఆర్ జిల్లాలు అయిన గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్, ఘాజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) లలో ఈ నియమం వర్తిస్తుంది. ఇక 2029 జనవరి 1వ తేదీ మూడో దశలో భాగంగా ఎన్సీఆర్ పరిధిలోకి వచ్చే మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ఆటోల కొత్త రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపి వేసి, 100 శాతం ఎలక్ట్రిక్ ఆటోలనే అనుమతిస్తారు.

More Stories
జూన్ 1 నుంచి సీబీఎస్ఈలో త్రిభాషా విధానం
ఐదు రోజులు ముందుగానే నైరుతి
యూపీలో పెనుగాలుల బీభత్సం, అకాల వర్షాలతో 117 మంది మృతి