ప్రధాని నరేంద్ర మోదీని `దేశ ద్రోహి’ అని నిందించడంతో పాటు ఓ ప్రభుత్వ అధికారిపై దాడి చేశారన్న ఆరోపణలపై సమాజ్ వాది పార్టీ ఎంపి అజేంద్ర సింగ్ లోధిపై మహోబాలో కేసు నమోదైందని మంగళవారం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అజేంద్ర సింగ్ లోధి హమీర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుఅవమానం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆయనపై సోమవారం రాత్రి బిఎన్ఎస్ (భారత శిక్షాస్మృతి) లోని సెక్షన్లు 132 (ప్రభుత్వ అధికారిపై దాడి), 189(2) చట్టవిరుద్ధమైన సమావేశం, 196(1) విద్వేషాన్ని ప్రోత్సహించడం, 352 (ఉద్దేశపూర్వక అవమానం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మోదీపై చేసిన వ్యాఖ్యలతోపాటు, లోధి కుల విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా మీడియా ఇన్‌చార్జ్ సత్యేంద్ర ప్రతాప్ గుప్తా చేసిన ఫిర్యాదుమేరకు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
లోధి మీడియాతో మాట్లాడిన సమయంలో మోదీ ఓ దేశ ద్రోహి అనడం, కుల విద్వేషాన్ని సృష్టించి మా మనోభావాలను దెబ్బతీశారని సత్యేంద్ర ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మే 11న లోధి, అతని మద్దతుదారులు విద్యుత్ కోతలు, స్మార్ట్ మీటర్ల సమస్యలతో పాటు ఇతర సమస్యలను ప్రస్తావిస్తూ విద్యుత్ శాఖకు 11 అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించారు.
విద్యుత్ సమస్యల్ని తీర్చాలని డిమాండ్ చేస్తూ లోధి ప్రభుత్వ కార్యాలయం వరకు చేసిన మార్చ్ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందని, ప్రభుత్వ ఉద్యోగుల పనికి ఆటంకం కలిగించిందని, మోదీని లోధి దేశ ద్రోహి అని పిలిచారని సత్యేంద్ర ప్రతాప్ గుప్తా ఆరోపించారు. అలాగే లోధి చేపట్టిన పాదయాత్రలో తాజాగా మోదీ బంగారం కొనొద్దు, పెట్రోల్ వాడకం తగ్గించండి అంటూ చేసిన విజ్ఞప్తుల్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మోదీ విదేశీ పర్యటనలను కూడా ఆయన ప్రశ్నించారు.
దేశానికి ఇలాంటి ప్రధాని ఇప్పటివరకు లేరని విమర్శించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యుత్ సమస్యలపై స్థానిక పరిపాలన విభాగానికి వినతిపత్రం సమర్పించిన అనంతరం లోధి విలేకరులతో మాట్లాడుతూ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ప్రభుత్వం పర్యవసానాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. లోధి వ్యాఖ్యలపై అభ్యంతరాలు తెలిపినందుకు ఆయనపై కేసు నమోదు చేశారు.
లోధి వ్యాఖ్యలపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందిస్తూ మోదీని ప్రధాని మోదీని దేశ ద్రోహి అన్న వ్యాఖ్యలు క్షమించరానివి, అభ్యంతరకమైనవి. ప్రజాస్వామ్య మర్యాదకు తీవ్రమైన దెబ్బ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. లోధి ప్రవర్తన “చెడు రాజకీయ సంస్కృతిని, సైద్ధాంతిక దివాళాను, ప్రజా జీవిత గౌరవం పట్ల అగౌరవాన్ని” ప్రతిబింబిస్తుంది’ అని ధ్వజమెత్తారు.

More Stories
రెండోసారి అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణం
మే 15 నుంచి 20 వరకు ప్రధాని మోదీ ఐదు దేశాల్లో పర్యటన
పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్యెల్యేల్లో తిరుగుబాటు