గత ఎన్నికల సమయంలో నేను జార్ఖండ్ ఉండగా, 2021 మార్చి 27న ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది విడతల్లో పూర్తి అవ్వగా, మే 2న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ రాత్రి నుండే హిందువులపై దాడులు మొదలయ్యాయి. మూడో తేదీ ఉదయం నుండి రాత్రి వరకు పురోలియా జిల్లా సరిహద్దు దాటి సుమారు 2000 మంది భయభ్రాంతులైన సామాన్య హిందువులు, కొందరు ప్రజాప్రతినిధులు ప్రాణ భయంతో కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఝార్ఖండ్ రాష్ట్రం ‘చాన్డీల్’ అనే గ్రామం దాటి రాంచీ పట్టణానికి వచ్చారు.
2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత జరిగిన హింసలో మరణించిన వారి సంఖ్యపై వేర్వేరు నివేదికలు ఉన్నాయి.
1. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) నివేదిక – జూలై 2021 ప్రకారం మొత్తం మరణాలు: 50+ మందికి పైగా ఉండగా పోలీసులు అధికారికంగా 29 హత్యలు అని చెప్పారు. కానీ స్వతంత్రులు లెక్కల్లో 52 అని, 170 హత్యలు అని ఉన్నాయి. అత్యాచారాలు, ఆస్తుల విధ్వంసం కూడా భారీగా జరిగాయని పేర్కొన్నారు.
2. ‘కాల్ ఫర్ జస్టిస్’ సివిల్ సొసైటీ గ్రూప్ నివేదిక ప్రకారం మాజీ చీఫ్ జస్టిస్ ప్రమోద్ కోహ్లీ నేతృత్వంలోని బృందం సమాచారం అందిన మేరకు మొత్తం మరణాలు 25 మంది అని నిర్ధారించింది. 15,000 హింసాత్మక ఘటనలు జరిగినట్లు ఫిర్యాదులందాయి. (ధైర్యం చేసి ఫిర్యాదు చేసిన వారు కొద్దిమందికాగా, ఫిర్యాదు చేయని వారి సంఖ్య కనీసం మూడింతలు ఉంటుందని సమాచారం). 7,000 మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయని, 16 జిల్లాలు ప్రభావితం అయ్యాయని తెలిపింది.
3. మీడియా రిపోర్టులు – మే 2021… టైమ్స్ అఫ్ ఇండియా ప్రకారం: మే 4, 2021 నాటికి 11 మంది హత్యకు గురయ్యారు
అధికారిక నివేదికలు మతాల వారీగా విడిగా లెక్కలు ఇవ్వలేదు. అయితే మరణించిన వారిలో ఎక్కువ మంది బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు హిందువులే ఉన్నారు. ఎన్ హెచ్ ఆర్ సి నివేదిక “ప్రతిపక్ష మద్దతుదారులను టార్గెట్ చేశారు” అని పేర్కొంది. ‘కాల్ ఫర్ జస్టిస్’ నివేదిక హింస “ప్రీమెడిటేటెడ్, ఆర్గనైజ్డ్” అని, రాజకీయ ప్రత్యర్థులను నిశ్శబ్దం చేయడానికే అని తెలిపింది. సీబీఐ ఈ హత్య కేసులను విచారిస్తోంది. చాలా కేసులు ఇంకా కోర్టులో ఉన్నాయి.
2023 జూన్ 8వ తేదీ జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు అనంతరం 13వ తేదీ కల్లా 57 మంది చనిపోయినట్లు ప్రకటన వెలువడింది. తీవ్రంగా గాయపడిన 400 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. గెలిచిన బిజెపి అభ్యర్థి కూచ్ బీహార్ కు చెందిన బర్మన్ కూడా హత్యకు గురయ్యాడు. ముర్షిదాబాద్, కూచ్ బెహార్, మాల్దా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో హింస ఎక్కువగా జరిగింది.
ఎప్పటి నుండి బెంగాల్ లో హిందువులే టార్గెట్!
బెంగాల్ మీదికి మొట్టమొదట ఆక్రమణ చేసిన ముస్లిం ముహమ్మద్ బఖ్తియార్ ఖిల్జీ, ఘురిద్ వంశానికి చెందిన టర్కిష్ సైన్యాధిపతి. 1202 లేదా 1204/1205 ఎప్పుడు జరిగిందనే విషయం లోచరిత్రకారుల మధ్య తేదీపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని ఆధారాల ప్రకారం 10 మే 1205 న నదియా ఆక్రమణ జరిగింది. ఖిల్జీ కేవలం 18-19 మంది అశ్విక దళంతో రాజధాని నదియా/నబద్వీప్‌పై దాడి చేశాడు
ఇంగ్లాండ్ క్రైస్తవుల ఆక్రమణ
ఏమైనప్పటికీ ఖిల్జీ దండయాత్ర నుండి ఆంగ్లేయుల దండయాత్ర నుండి ఇప్పటివరకు హిందువుల పైన వివిధ పద్ధతుల ద్వారా అంతులేని అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దేశ విభజన జరిగి, బెంగాల్ విభజనయ్యి బంగ్లాదేశ్ గా మారినా భూభాగంలో 1901లో ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతంలో 33 శాతంగా ఉన్న హిందువుల సంఖ్య 123 ఏళ్లలో 7.95 శాతంకు పడిపోయింది. కేవలం 1971 సంవత్సరం యుద్ధం తర్వాత 20 లక్షల మంది ఆచూకీ తెలియలేదు.
అత్యాచారాలు ఆగిపోయినట్లేనా?
2026 మే 4వ తేదీ ఎన్నికల ఫలితాలు శ్రీరామభక్తులు సమర్ధించిన పార్టీ విజయకేతనాన్ని ఎగిరేసింది. రామభక్తులు అని ఎందుకు అంటున్నానంటే గత పది సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్లోని ప్రతి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి శోభాయాత్ర నిర్వహించడం, హైందవులలో చైతన్యం రావడం, మరొకవైపు అయోధ్యలో శ్రీరామచంద్రుని గుడి నిర్మించబడడం జరుగుతుంది.
బెంగాల్ ఎన్నికల్లో మోహరించిన పోలీసు/రక్షణ బలగాలు
2026 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మొత్తం 2.4 లక్షల మంది బలగాలను మోహరింపచేశారు. (2,550 సి ఏ ఆర్ పి కంపెనీలు). 2021 అసెంబ్లీ ఎన్నికల సమయం కంటే రెట్టింపు సంఖ్యలో మోహరింప చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 900 కంపెనీలు మాత్రమే పాల్గొన్నాయి. ఒకే రాష్ట్రంలో ఎన్నికల కోసం ఇంత పెద్ద మోహరింపు జరపడం ఇదే మొదటిసారి.
2023 పంచాయతీ ఎన్నికల సమయంలో 822 కంపెనీలను మోహరించాలని కోర్టు ఆదేశించినా పోలింగ్ రోజు నాటికి 649 కంపెనీలు మాత్రమే వచ్చాయి. 61,636 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఈ బలగాలను కేవలం 15,000 బూత్‌లలో మాత్రమే మోహరించారు. మిగిలిన చోట్ల బలగాలు లేకపోవడంతో 12-15 మంది చనిపోయారు, మొత్తం 48-57 మంది మరణించారు.
2026లో ఒక్క మరణం కూడా లేకుండా ఎన్నికలు జరిగాయి. .రికార్డు ప్రకారం 2021లో 58 మంది, 2023 పంచాయతీలో 50 మంది చనిపోయారు. అందుకే ఈసారి రికార్డు స్థాయిలో బలగాలను మోహరించారు.
హిందువులను ఎవరు కాపాడాలి?
“ఎన్నికల సమయంలోనే 2,40,000 అక్షరాల రెండు లక్షల నలబై వేల మంది ఉండగా రోజువారీ జీవితంలో రక్షణ ఎవరు కల్పిస్తారు? రక్షక బలగాలు వచ్చే వరకైనా తమను తాము రక్షించుకోగలగాలి. దీనికై హిందువులు సంఘటితంగా, కలిసికట్టుగా ఉండాలి. తమ సంఖ్యను పెంచుకోవాలి. లేకపోతే ఎప్పటి వలెనే అవమానాలు, అత్యాచారాలు జరుగుతునే ఉంటాయి.” బెంగాల్ హిందూ ప్రజలను చూసి అర్థం చేసుకోవాలి. సంఘటిత శక్తియే మన జాతికి శ్రీరామరక్ష. దేశవ్యాప్తంగా హిందువులు ఐక్యం కావాలి. అన్యాయాలను ఎదుర్కోవాలి.

More Stories
జలంధర్, అమృత్సర్ సైనిక కేంద్రాల వద్ద ప్రేలుళ్ళు!
కేరళ ఓటమితో దేశంలో అస్థిత్వ సంక్షోభంలో ‘లెఫ్ట్’!
కేరళంలో ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ లో పోటా పోటీ!