బిహార్ మాజీ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కుమారుడు, జేడీయూ నేత నిశాంత్ కుమార్ ఆదివారం సద్భావ యాత్రను ప్రారంభించారు. పాట్నాలోని పార్టీ కార్యాలయం నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. సంస్థాగతంగా జెడియును బలోపేతం చేయడం, ప్రజలను ప్రత్యక్షంగా కలిసేందుకు ఈ యాత్ర చేపట్టినట్లు నిశాంత్ తెలిపారు.
ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్ కుమార్, నీతీశ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలుచేసిన కొన్ని రోజుల తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. మార్చి 8న అధికారికంగా జేడీయూలో పార్టీలో చేరారు. ధనికులు, పేదలు, దళితులు, అతి పేదలు, మైనారిటీలు ఇలా అన్ని తరగతుల ప్రజలను కలుపుకుని వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే తాము తమ యాత్రకు సద్భావ యాత్ర అని పేరు పెట్టినట్టు ఆయన తెలిపారు.
“మేం ఈ యాత్రకు దీనికి సద్భావ యాత్ర అని పేరు పెట్టాం. దీని అర్థం అందరినీ కలుపుకొని వెళ్లడం. ధనికులు, పేదలు, దళితులు, అతి పేదలు, మైనారిటీల అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వెళ్లాలి. సమాజంలో పరస్పర ప్రేమ, ఐక్యత పెంపొందించడమే లక్ష్యం” అని తెలిపారు.
సమాజంలో పరస్పర ప్రేమ, ఐక్యత పెంపొందించడమే లక్ష్యంగా పేర్కొన్నారు. మహాత్మా గాంధీ కూడా తన మొదటి సత్యాగ్రహాన్ని చంపారన్ నుంచే ప్రారంభించారని, తన తండ్రి నితీష్ కూడా యాత్రలన్నీ అక్కడి నుంచే ప్రారంభించారని, వారి స్ఫూర్తితో తాను కూడా యాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ యాత్రలో నిశాంత్‌తో పాటు యువ ఎమ్మెల్యేలు ఋతురాజ్, శుభానంద్ ముకేశ్, చేతన్ ఆనంద్, రుహేల్ రంజన్, జెడియు రాష్ట్ర అధ్యక్షుడు ఉమేశ్ కుష్వాహా కూడా ఉన్నారు.
ఈ యాత్ర పలు దశల్లో కొనసాగుతుంది. మొదటి దశ మే 3, 4 తేదీలలో బగాహా నుంచి ప్రారంభమవుతుంది. రెండో దశ చారిత్రాత్మక ప్రాంతమైన వైశాలి నుంచి మొదలవుతుంది. యాత్ర ప్రారంభానికి ముందు నిశాంత్ కుమార్, పట్నాలోని నివాసంలో నీతీశ్ కుమార్ ఆశీర్వాదం తీసుకున్నారు. తర్వాత పార్టీ కార్యాలయానికి చేరుకుని యాత్రను ప్రారంభించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నీతీశ్ కుమార్ ఉపయోగించిన ఆధునిక సౌకర్యాలతో కూడిన రథంలోనే నిశాంత్ కుమార్ యాత్ర చేయనున్నారు.

More Stories
21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు
మమతను ఓడించిన బిజెపి… గెలుపొందిన అధికార పార్టీ బిజెపినే!
నోబెల్ శాంతి బహుమతికి ‘ప్యాడ్‌మ్యాన్’ అరుణాచలం పేరు