* మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై తొలిసారి వినేష్ ఫోగాట్ వెల్లడి
మాజీ రెజ్లర్, ప్రస్తుత ఎమ్మెల్యే వినేశ్ ఫొగాట్ తాను బ్రిజ్ భూషణ్ బాధితురాలినే అంటూ ఎక్స్‌లో వెల్లడించారు. బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టును ఆశ్రయించిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తానూ ఒకరినని వినేష్ తొలిసారిగా వెల్లడించారు. మూడేళ్ల క్రితమే లైంగిక వేధింపులపై తాము స్వరం ఎత్తామని, అయితే కేసు విచారణ కొనసాగుతున్నందున ఇప్పటి వరకు బయట మాట్లాడలేదని ఆమె వివరించారు.
ఫిర్యాదు చేసిన వారిలో తాను కూడా బాధితురాలినేనని చెబుతూ అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున పూర్తి వివరాలు చెప్పడానికి ఆమె నిరాకరించింది. ఆదివారం సోషల్ మీడియా ఎక్స్‌లో వీడియో పెట్టిన వినేశ్ తనను కూడా బ్రిజ్ భూషణ్ వేధించాడని చెప్పింది.
“సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితుల వివరాలు వెల్లడించకూడదు. ఎందుకంటే పేర్లు, వివరాలు బహిర్గతం చేయడం బాధితుల గౌరవం, పరువుకు భంగం కలిగిస్తుంది. అయినా సరే కొన్ని పరిస్థితుల కారణంగా నేను ఈరోజు మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నందున నేను ఇన్నాళ్లు మాట్లాడలేదు. కానీ, మీకు ఒక విషయం చెప్పాలి. బ్రిజ్ భూషణ్‌పై కేసు వేసిన ఆరుగురు బాధితుల్లో నేను ఒకరు. మేము సాక్ష్యాలను సమర్పించినా.. కేసు ఇంకా నడుస్తోంది” అని వినేశ్ వెల్లడించింది.
కాగా, బ్రిజ్ భూషణ్ సింగ్ ప్రభావం ఉన్న గొండాలో మే 12 నుంచి 14 వరకు జరగనున్న జాతీయ ఓపెన్ స్థాయి ర్యాంకింగ్ ఈ పోటీల్లో తాను పాల్గొననున్నట్లు వీడియో సందేశంలో అనే తెలిపారు. 18 ఏళ్ల అనంతరం తిరిగి ఆమె ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ పోటీలు బ్రిజ్ భూషణ్,ఆయన అనుచరుల ఆధీనంలో జరుగుతున్నందున, కష్టపడి పోటీపడే క్రీడాకారులకు న్యాయం జరగడం కష్టమని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అధికారికంగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవి నుండి తొలగించినప్పటికీ డబ్ల్యు ఎఫ్ ఐపై ఇప్పటికీ తనకే పట్టు ఉందని బ్రిజ్ భూషణ్ బహిరంగంగా చెబుతున్నారని పేర్కొంటూ ఈ పోటీల్లో తనకు లేదా తన బృందానికి ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుంటే, దానికి కేంద్ర ప్రభుత్వం, క్రీడా శాఖ పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
ఆమె ప్రకటనకు స్పందిస్తూ, డబ్ల్యుఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ ఆమె భద్రతకు తాను ‘వ్యక్తిగతంగా హామీ’ ఇస్తానని తెలిపారు. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అయిన వినేష్ ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని ఆయన హితవు చెప్పారు.

More Stories
21కి చేరిన ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు
మమతను ఓడించిన బిజెపి… గెలుపొందిన అధికార పార్టీ బిజెపినే!
నోబెల్ శాంతి బహుమతికి ‘ప్యాడ్‌మ్యాన్’ అరుణాచలం పేరు