None
లెబనాన్‌లోని ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా వద్ద కొత్త ఆయుధం ఉన్నట్లు తాజాగా వెల్లడైంది. ప్రత్యేకంగా రూపొందించిన డ్రోన్లతో హెజ్బొల్లా ఉగ్రవాదులు ఇజ్రాయెల్ సైనికులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించాడు. మరికొందరు గాయపడ్డారు. వీరిని రక్షించేందుకు వెళ్లిన రెస్క్యూ హెలికాప్టర్‌పై కూడా మళ్లీ హెజ్బొల్లా ఇదే డ్రోన్లతో దాడి చేసింది.
దీనికి సంబంధించిన వీడియోను హెజ్బొల్లా సంస్థ విడుదల చేసింది. ఈ అంశంపై ఇజ్రాయెల్‌కు చెందిన ఐడీఎఫ్, నిపుణులు కీలక వివరాలు వెల్లడించారు. వారి అంచనా ప్రకారం హెజ్బొల్లా వద్ద చవకైన, కచ్చితత్వంతో పని చేయగల డ్రోన్ ఉంది. అది కూడా శతృవుల ఎలక్ట్రానిక్ రాడార్లకు చిక్కకుండా దీన్ని తయారు చేశారు. అయితే, ఇది రెగ్యులర్ డ్రోన్ కాదు. కానీ, ప్రమాదకరమైంది. ఇది గ్రెనేడ్లను మోసుకెళ్లగలదు. దీన్ని చైనా లేదా ఇరాన్ అందించినట్లు అనుమానిస్తున్నారు.
ఇది ఫైబర్ ఆప్టిక్ క్వాడ్‌కాప్టర్ డ్రోన్. చాలా తేలికగా ఉంటుంది. కానీ, బరువైన వాటిని మోసుకెళ్లగలదు. అలాగే, కచ్చితత్వంతో పని చేస్తుంది. అలాగే, దీన్ని రాడార్‌లో గుర్తించడం కష్టం. ఎందుకంటే, ఇది రేడియో సిగ్నల్ ఆధారంగా పని చేయదు. ఒక చిన్న కేబుల్ ఆధారంగా పని చేస్తుంది. అందువల్ల రాడార్లతో గుర్తించి, వీటిని ధ్వంసం చేయడం కుదరదు. దీన్ని బ్లాక్ చేయడం, అడ్డుకోవడం కుదరదు. అందువల్ల ఇది శతృవులపై దాడిలో విజయం సాధిస్తుంది.
ఈ తరహా డ్రోన్లతో దాడి చేసినప్పుడు అడ్డుకోవాలంటే నెట్స్, గ్రిల్స్ వంటివి ఏర్పాటు చేసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. అందుకే ఈ విషయంలో ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ తరహా డ్రోన్లను కొద్దికాలం క్రితం ఉక్రెయిన్ వాడింది.

More Stories
లిపులేఖ్ పాస్ ద్వారా మానస సరోవర్ యాత్రపై నేపాల్ అభ్యంతరం!
ట్రంప్ కు `అసాధ్యమైన ఆపరేషన్’ లేదా `ఇరాన్ తో రాజీ’ మాత్రమే!
వలసదారుడిని బిషప్‌గా నియమించిన పాప్