సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం పాక్ ఆపే వరకు ఏమీ మారదని గుర్తు చేసింది. ‘‘సింధూ జలాల ఒప్పందంపై (ఐడబ్ల్యూటీ) భారత్ వైఖరి స్థిరంగా ఉంది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్థాన్ నిరంతర మద్దతుకు ప్రతిస్పందనగా ఈ ఒప్పందం నిలిపివేశాం.. సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ తన మద్దతును విరమించుకోవాలి’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తేల్చి చెప్పారు.
కాగా, తీవ్రవాదానికి స్వర్గధామంగా పేరొందిన పాకిస్థాన్ ఐడబ్ల్యూటీ విషయంలో స్వయంకృత అపరాధం వల్ల అత్యంత నిరాశాజనకమైన స్థితికి చేరుకుంటోందని, అయితే దానిని అంగీకరించడానికి ఇష్టపడటం లేదని వ్యూహాత్మక నిపుణులు అంటున్నారు. అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ సహా కీలక ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఈ దేశం భారత్లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో దాడులకు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి ఉగ్రవాదులను అనుమతిస్తూనే ఉంది.
ఐడబ్ల్యూటీ విషయంలో అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సింధు జలాలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న భారత నిర్ణయాన్ని తమ దేశం తిరస్కరిస్తోందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ ఒప్పందం చెల్లుబాటయ్యేలా అమల్లో ఉందని వ్యాఖ్యానించారు.
అదే కార్యక్రమంలో పాక్ మాజీ మంత్రి బిలవల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ ‘‘పాకిస్తాన్ అణు బాంబులు కేవలం ఉత్సవాల కోసం కాదు. సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి చేసే అన్ని ప్రయత్నాలు విఫలమైతే, పాకిస్తాన్ తప్పనిసరిగా అణు ప్రత్యామ్నాయాన్ని అన్వేషించాలి’’ అని బెదిరింపులకు పాల్పడ్డారు. గత సంవత్సరం కూడా ఈ ఒప్పందం నిలిపివేసిన తర్వాత ‘‘సార్వభౌమ దేశంగా తన హక్కులను వినియోగించుకోవడంలో భారతదేశం తీసుకున్న చర్యల చట్టబద్ధతను పరిశీలించే అధికారం ఏ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికీ, మరీ ముఖ్యంగా చట్ట దృష్టిలో ఉనికి లేని, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ సంస్థకు అసలే లేదు’’ అని భారత్ జూన్ 2025లో పేర్కొంది.

More Stories
పీఓకె ఎన్నికలను బహిష్కరించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ
ఐరాస భవనం ఎదుట టిబెట్ ఉద్యమకారుడు ఆత్మాహుతి
పాక్ సైన్యమే కశ్మీరీలకు ఆయుధాలు ఇచ్చి ఉగ్రవాదులు అంటారా?