మరోవైపు ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధానికి దారితీసింది. అధికారుల నిర్బంధం ఘటనను ఖండించిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, దీని వెనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్నికల సంఘం కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్రం పన్నుతున్న వ్యూహంలో భాగంగానే ఈ అలజడిని సృష్టిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక తన అధికారాలు తగ్గిపోయాయని, అందుకే యంత్రాంగంపై పట్టు కోల్పోయానని మమతా వివరించారు. బోగస్ ఓటర్లను తొలగిస్తుండటంతో భయం పట్టుకున్న టీఎంసీ, ఉద్దేశపూర్వకంగానే ఈ అరాచకానికి పాల్పడిందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు వారాల సమయం మాత్రమే ఉండటంతో, మాల్దాతో పాటు జల్పాయ్గుఢి, కూచ్ బెహర్, పూర్బా బర్ధమాన్ వంటి జిల్లాల్లో కూడా నిరసనలు మిన్నంటాయి.
ఈ నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ఓటర్ల సవరణ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంతుకుముందు బంగాల్లోని మాల్దా జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ విధుల్లో ఉన్న ఏడుగురు జ్యుడీషియల్ అధికారుల నిర్బంధం ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఓటర్ల జాబితా నుంచి అసలైన పేర్లను తొలగిస్తున్నారనే ఆగ్రహంతో ముగ్గురు మహిళా అధికారులతో సహా ఏడుగురిని 9 గంటల పాటు నిరసనకారులు బందీలుగా ఉంచారు. జాతీయ రహదారిని దిగ్బంధించడమే కాకుండా, అధికారులను విడిపించడానికి వచ్చిన పోలీసులపై రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేసేందుకు యత్నించారు

More Stories
సువేందు అధికారి పీఏ హత్యలో ముగ్గురు షార్ప్షూటర్లు అరెస్టు
ఎబివిపికి సైద్ధాంతిక స్పష్టత, సంస్థాగత దార్శనికత అందించిన కేల్కర్
ఏఐఎంఐఎం ఒక ఉగ్రవాద సంస్థ.. నిషేధించాలి