అందుకు నిదర్శనంగా ఈ బడ్జెట్ అయిపోగానే రేవంత్ రెడ్డి కేరళం ఎన్నికల ప్రచారానికి వెళ్లడమే అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రచారం కోసం కేరళకు వెళ్లిన రేవంత్ రెడ్డి పినరయి విజయన్ ని ప్రధాని మోదీ ఏజెంట్ అని, కమ్యూనిస్టులకు ఓటేస్తే బిజెపికి ఓటేసినట్లేనని, కమ్యూనిస్టులు-బిజెపి ది ఫెవికాల్ బంధమని అనడం పూర్తిగా హాస్యాస్పదం అని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టు పార్టీలు మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తున్నాయంటూ కేరళలో రేవంత్ రెడ్డి ఒక నిజం మాత్రం చెప్పారని చెబుతూ మతతత్వ సంస్థలైన ఎంఐఎం, ఎస్‌డిపిఐ, పీఎఫ్ఐలను కమ్యూనిస్టులు ఏనాడూ విమర్శించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. వాస్తవానికి పరోక్షంగా ప్రోత్సహించిన సందర్భాలే ఎక్కువగా కనిపిస్తాయని కిషోర్ తేల్చి చెప్పారు.
అయితే కేరళంకు వెళ్లి కమ్యూనిస్టు పార్టీలు మతతత్వ శక్తులను ప్రోత్సహిస్తున్నాయంటూ నిజం మాట్లాడిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్ననే ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా వెళ్లి, కమ్యూనిస్టు కార్యకర్తలు లేదా పార్టీలు నిటారుగా నిలబడి మతతత్వ శక్తులపై పోరాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి ఇంతకంటే పెద్ద నిదర్శనం మరొకటి ఉండదని చెప్పారు. తెలంగాణలో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేక, ఆ వైఫల్యాల తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడ చేసిన వాగ్దానాలను కేరళంలో పునరావృతం చేయడానికి మొహం చెల్లక రేవంత్ రెడ్డిని పంపించినట్లుగా కనిపిస్తోందని కిషోర్ ఎద్దేవా చేశారు.

More Stories
ఆటిజంలో ముందస్తు గుర్తింపు, జోక్యం తప్పనిసరి
మూసీ ప్రాజెక్టుపై ఎన్జీటీలో ప్రభుత్వానికి ఊరట
దండుగమారి వ్యవహారంగా మారిన ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’