గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. 2,302 సర్పంచి స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారు. 1,158 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పాగా వేశారు. 528 చోట్ల ఇతరులు, స్వతంత్రులు గెలుపొందగా, 186 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,302 సర్పంచి స్థానాల్లో విజయదుందుభి మోగించారు.
సిద్దిపేట, కుమురం భీం మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్, 1158 పంచాయతీలను గెలిపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 528 చోట్ల విజయం సాధించారు. బీజేపీ 200లోపు స్థానాలకు పరిమితమైంది.
నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలు కామారెడ్డి, జనగామ, నాగర్కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఆధిపత్యం కనపరిచారు. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ హస్తం మద్దతుదారులదే హవా కొనసాగింది. సిద్దిపేట, కుమురం భీం జిల్లాలో బీఆర్ఎస్ బలపరిచిన వారు ఆధిక్యం సాధించారు. మహబూబ్నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్కు బీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చింది.

More Stories
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు
జలమండలి జీఎం అక్రమాస్తులు వంద కోట్లపైనే!
లులు మాల్లో కుళ్లిపోయిన కూరగాయాలు, పురుగులు