ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని చెచెబుతూ ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ పేర్కొన్నారు.
ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ సూచించారు. రాజ్యాంగపరమైన అవసరమే కాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమని ఆయన గుర్తు చేశారు.
ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్ స్పష్టం చేశారు.

More Stories
దుర్గగుడి అభివృద్ధికి త్వరితగతిన మాస్టర్‌ప్లాన్
జిఎస్టి ఆదాయం తగ్గడంపై ఏపీ ఆర్థికశాఖ ఆందోళన
మహిళా క్రికెటర్ శ్రీచరణికి గ్రూప్1 ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు