1991 నుండి 2003 మధ్యకాలంలో మహోర్, చస్సానా కొండల నుండి ముప్పై మంది పురుషులు అదృశ్యమయ్యారు. సంవత్సరాల తరబడి, వారు కనిపించడం లేదని వారి కుటుంబాలు చెబుతూ వచ్చాయి. కానీ, ఇప్పుడు పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, వారు అదృశ్యం కాలేదు. బాంబులు తయారు చేయడం, రైఫిళ్లు కాల్చడం మరియు భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం ఎలాగో నేర్చుకోవడానికి పాకిస్థాన్‌కు వెళ్లారు.
దశాబ్దాల తర్వాత, పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని సురక్షిత స్థావరాల నుండి, వారు ఒక కొత్త రకమైన యుద్ధం చేస్తున్నారు. కేవలం తుపాకులతో మాత్రమే కాకుండా ఆస్తుల ఒప్పందాలు, తీవ్రవాద భావజాలం వ్యాప్తి, డబ్బుతో కూడా. ప్రస్తుతం సరిహద్దుకు ఆవలి వైపు నుండి పనిచేస్తున్న ఈ 30 మంది ఉగ్రవాదుల జాబితా ఉన్న ఒక పత్రం వెల్లడైంది.
ఎన్డీటీవీ సేకరించిన ఆ పత్రం ప్రకారం, వారు పాకిస్థాన్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నారు. వారికి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తూ, డబ్బు పంపుతూ, జమ్మూ లోపలి ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించడానికి యువతను రెచ్చగొడుతూ, వారిలో తీవ్రవాద భావజాలాన్ని నింపుతున్నారు. 2024 నవంబర్ 29న అందిన సమాచారం మేరకు, బిఎన్ఎస్, యూఏపీఎ కింద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
విచారణ సమయంలో, సాక్షుల వాంగ్మూలాలు ఒక భయంకరమైన ధోరణిని వెల్లడించాయి. ఉగ్రవాదులు కేవలం దూరం నుండి హింసను నిర్దేశించడమే కాకుండా, రియాసి జిల్లాలోని తమ సొంత భూములను అమ్మి, ఆ సొమ్ముతో ఆ ప్రాంతంలో మరిన్ని ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మార్గాన్ని అడ్డుకోవడానికి రియాసి పోలీసులు వేగంగా చర్యలు చేపట్టారు.
“జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆదేశాల మేరకు, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఐదుగురు కీలక ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేశాం,” అని రియాసి ఎస్ఎస్పీ ముకుంద్ లాల్ తెలిపారు. మొదటగా, భూమి, ఆస్తులు సీల్ చేసిన లేదా జప్తు చేసినఐదుగురు ఉగ్రవాదులలో మహోర్‌కు చెందిన మహమ్మద్ ఖయూమ్ అలియాస్ అబ్దుల్ ఖయూమ్ షాడోలే, అతని మూడు కనాల్‌ల భూమిని జప్తు చేశారు.
బద్దర్‌కు చెందిన బషీర్ అహ్మద్ అలియాస్ మాసూమ్, అతని మూడు కనాల్‌ల భూమిని సీల్ చేశారు. అర్నాస్‌కు చెందిన షౌకత్ అలీ హండర్‌కు చెందిన మూడు కనాల్ భూమిని, అలాగే తురూ గ్రామానికి చెందిన మంజూర్ అహ్మద్ అలియాస్ మంజూర్ హుస్సేన్ ఖాంతికి చెందిన 15 కనాల్ 19 మార్లాల భూమిని జప్తు చేశారు.

More Stories
దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవంలో యువత భాగస్వామ్యం
జమ్మూ కశ్మీర్లో 65 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు!
ఆస్కార్ బరిలో భారతీయ సినిమా ‘గోంధళ్’!