ఇండోర్ లో ఆర్ఎస్ఎస్ కార్యకారి మండలి సమావేశాలు ప్రారంభం

 
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మూడు రోజుల వార్షిక మూడు రోజుల అఖిల భారత కార్యకారి మండలి సమావేశాలు సోమవారం ఇండోర్ లోని డైలీ కాలేజీలో ఉన్న సంత్ శ్రీ రవిదాస్ సభా మందిరంలో ప్రారంభమయ్యాయి. సమావేశాలను సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే  భారతమాత చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు.

ఈ సమావేశంలో సహ సర్కార్యవాహ్ లందరూ, అఖిల భారత పదాధికారులు, క్షేత్ర సంఘ్ చాలక్ లు, కార్యవాహ్ లు, ప్రచారక్ లు, ప్రాంత సంఘ్ చాలక్ లు, కార్యవాహ్ లు, ప్రచారక్ లు , సంఘ్ ప్రేరిత వివిధ సంస్థల అఖిల భారత సంఘటన మంత్రులు పాల్గొంటున్నారు.

సమావేశం ప్రారంభంలో సర్ కార్యవాహ్ గత కొన్ని నెలల్లో మరణించిన సమాజంలోని ప్రముఖ వ్యక్తులకు, కార్యకర్తలకు నివాళులు అర్పించారు. వారిలో ప్రముఖంగా  సినీ నటులు నానా పాటేకర్, శ్రీమతి ఆశా భోంస్లే, పూజ్య సంత్ పద్మశ్రీ రమేష్ బాబా, వివేకానంద కేంద్ర మాజీ అధ్యక్షులు బాలకృష్ణన్ , బల్బీర్ పుంజ్,  ఎస్. వేదాంతం – చెన్నై, పాత్రికేయులు విరాగ్ పాచ్‌పోర్, మాజీ వైస్ ఛాన్సలర్ లు దేవేంద్ర ప్రతాప్ సింగ్, సచ్చిదానంద మహంతి, ప్రముఖ గాయనీలు ఎస్. జానకి, సుమన్ కల్యాణ్ పురికర్, సంఘ్ సీనియర్ ప్రచారక్ వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఈ సమావేశంలో జాతీయ చైతన్య పితామహుడు రాజ్ నారాయణ్ బోస్ 200వ జయంతి సందర్భంగా, శుద్ధీకరణ ఉద్యమ ప్రారంభికులుస్వామి శ్రద్ధానంద్ బలిదానం జరిగి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఒడిశాలోని కంధమాల్ గిరిజన ప్రాంతంలో స్వాభిమానం – స్వావలంబన – స్వధర్మ జాగృతి కోసం పనిచేసిన వేదాంత కేసరి స్వామి లక్ష్మణానంద సరస్వతి జన్మించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మూడు ప్రత్యేక ప్రకటనలను  దత్తాత్రేయ హోసబలే విడుదల చేస్తారు. 

About The Author