మొన్నటి వరకు క్వింటాలు రూ.6వేల నుంచి రూ. 7 వేలకు పలికిన సన్న బియ్యం ధరలకు ఇప్పుడు అమాంతం రెక్కలు వచ్చాయి. నెల రోజుల వ్యవధిలోనే 25 నుంచి 35 శాతం వరకు పెరిగాయి. ఒకటి రెండు నెలల్లో మరో 30 శాతం పెరిగే అవకాశాలుండగా, పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం, ఇతర రాష్ట్రాల బ్రోకర్లు కల్లాల మీద నుంచే వడ్లను తన్నుకుపోతుండడం, మరోవైపు స్థానిక వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్ లో మంచి రకం బియ్యం ధరలు కిలో రూ 95 వరకు పెరిగాయి.
తెలంగాణాలో పండే బీపీటీ, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ, జైశ్రీరామ్ వంటి తదితర సన్నరకాల బియ్యానికి ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. పొరుగు రాష్ట్రాల్లోని మెట్రో నగరాలైన ముంబై, బెంగళూర్, చెన్నై వంటి ప్రాంతాలతోపాటు విదేశాల్లోనూ మంచి ఆద రణ ఉన్నది. అయితే ఈ సారి ఎల్‌నినోతో వర్షాభావ పరిస్థి తులు ఏర్పడడం, ఆయా రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మన ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డిలతోపాటు సన్నాలు పండించే జిల్లాల్లో రైతు లకు అడ్వాన్స్‌లు ఇస్తూ కోతల మీద నుంచే కొనుగోళ్లు చేస్తున్నారు. వారం క్రితం వరకు క్వింటాలు రూ.3,800 పెట్టిన వ్యాపారులు, ఇప్పుడు రూ. 4వేల నుంచి రూ.4,200 వరకు పెడుతున్నారు. అయితే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు, తరుగు, చెల్లింపుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండడంతో రైతులు వ్యాపారులకు అమ్మేందుకే ఇష్ట పడుతున్నారు.
అసలే ఎల్ నినో కారణంగా సాగు తగ్గడం, ఉన్న సనరకం ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలుతుండ డంతో మన రాష్ట్రంలో సన్నబియ్యం సంక్షోభం రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జైశ్రీరామ్ పాత బియ్యం నెల క్రితం క్వింటాలుకు రూ.6,800 ఉంటే, ఇప్పుడు అది రూ.8,500కు పెరిగింది. అలాగే సాంబామ సూరి నెల క్రితం రూ.4,600 ఉంటే, ప్రస్తుతం 800 చేరింది. రూ.5,800 ఉన్న హెచ్ఎంటీ ఇప్పుడు రూ.7వేలు అయింది. ఆర్ఎన్ఆర్ (స్టీమ్) నెల క్రితం రూ.5,800 ఉంటే, ప్రస్తుతం రూ.7,200కు పెరిగింది.
సర్కారు ముందుచూపు లేకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. సన్న బియ్యం ధరలు తమ అంచనాలకు అందకుండా పెరిగాయని, పాత నాణ్యమైన బియ్యం కిలో ధర వందకు చేరిందని, ఇలా అయితే తాము బతికేదెలా అని ఆవేదన చెందుతున్నారు.

More Stories
సాగు నీరు, తాగు నీరు, విద్యుత్ లపై చేతులెత్తేసిన రేవంత్
ఇన్వెస్ట్మెంట్ యాప్‌ల అంతరాష్ట్ర ముఠాలపై ఈడీ దాడులు
డిసెంబర్ లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ ప్రారంభం