స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని, అది మన అంతరాత్మకు సంబంధించిన విషయమని ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ డా. అరవింద్ భదౌరియా స్పష్టం చేశారు. విజయవాడలోని పాయకరావుపేట రైతు బజార్ వద్ద స్వచ్ఛ బిజెపి ఆధ్వర్యంలో జరిగిన భారత్ అభియాన్, గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలలో పాల్గొంటూ ఒక వ్యక్తి పరిశుభ్రంగా ఉంటే కుటుంబం, కుటుంబం ద్వారా సమాజం, సమాజం ద్వారా దేశం మొత్తం (గ్రామాలు, నగరాలు) పరిశుభ్రంగా మారుతాయని తెలిపారు.
ప్రధాని మోదీ కుంభమేళాలో పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి వారికి దేశంలో ఎవరూ ఇవ్వని అత్యున్నత గౌరవం ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. నిరంతరం పరిశుభ్రత కోసం పాటుపడుతున్న సోదరీమణులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఉద్యమాన్ని ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 70 నుంచి 80 శాతం అనారోగ్యాలకు అపరిశుభ్రతే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమస్యను రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ను ఒక సంకల్పంగా తీసుకున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల వ్యాధుల తీవ్రత తగ్గిందని, దీని ఫలితంగా వైద్య బడ్జెట్ భారం కూడా తగ్గిందని సభలో ఉన్న వైద్యులు సైతం అంగీకరించారని వివరించారు. నేటి పిల్లలు ప్రయాణాల్లో చెత్తను రోడ్లపై పారేయకుండా, తమ వద్దే ఉంచుకుని డస్ట్ బిన్ కనిపించినప్పుడు మాత్రమే అందులో వేస్తున్నారని, ఇది ఒక గొప్ప సానుకూల మార్పు అని కొనియాడారు. ఇది దేశవ్యాప్తంగా ఒక జన జాగరణ, జన విశ్వాస ఉద్యమంగా మారిందని తెలిపారు.
రాష్ట్ర సహ ఇంచార్జ్ శ్రిమతి వానతి శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ అనేది కేవలం ఒక రోజు కార్యక్రమం కాదని, ఇది ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి అవసరమైన ఒక దీర్ఘకాలిక దృక్పథం అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ దృష్ట్యా, పౌరులు తమ రోజువారీ అలవాట్లలో, ముఖ్యంగా చెత్తను వేరుచేయడం, పారవేయడంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. స్థానిక పార్కును శుభ్రపరచడం ద్వారా ఈ ప్రచారం విస్తృత లక్ష్యాలను ఆచరణాత్మకంగా ప్రదర్శించారు.
పట్టణ ప్రాంతాల్లోని చిన్న చిన్న కాలనీ పార్కులను చెత్త డంపింగ్ యార్డులుగా మార్చడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పార్కులను డంపింగ్ గ్రౌండ్లుగా దుర్వినియోగం చేయకుండా పౌరులు అప్రమత్తంగా ఉండి, అడ్డుకోవాలని గట్టిగా కోరారు. శుభ్రపరిచిన పార్కును సమాజం కోసం ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంగా ఉంచాలని ప్రజలకు, సంబంధిత ప్రభుత్వ అధికారులకు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పారిశుధ్య కార్మికులకు పూలతో శాలువాలతో సత్కరించి,నూతన వస్త్రాలను అందించారు.

More Stories
ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ జీవోల రద్దు
మోదీ 25 ఏళ్ల ప్రజాప్రస్థానం సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు జరపాలి
సంఘ్ జేష్ఠ కార్యకర్త దోనేపూడి వెంకయ్య మృతి