రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 22, మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో యూపీలో 10 స్థానాలకు, ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి ఎన్నిక జరగనుండగా, పశ్చిమ బెంగాల్‌లో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 16న ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. కొందరు రాజ్యసభ సభ్యుల కాల పరిమితి నవంబర్ 25న ముగియనుంది.
వీరిలో బిజెపికి చెందిన అరుణ్‌సింగ్, గీతా శాక్య, నీరజ్ శేఖర్, బృజ్‌లాల్, బీఎల్ వర్మ, సీమా ద్వివేది, హర్దీప్‌సింగ్ పురి ఉన్నారు. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్‌గోపాల్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన రామ్‌జీ గౌతమ్ పదవీకాలం కూడా ముగియనుంది. మాజీ ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మ రాజీనామాతో మరో రాజ్యసభ స్థానం సెప్టెంబర్ 11 నుంచి ఖాళీగా ఉంది.
అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన నేపథ్యంలో ఆయన రాజీనామా అమల్లోకి వచ్చింది. ప్రస్తుత అసెంబ్లీ బలాబలాల ప్రకారం యూపీలో బిజెపి నేతృత్వంలోని కూటమి 8 స్థానాలు, సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకునే అవకాశముందని రాజకీయ లెక్కలు సూచిస్తున్నాయి. సిట్టింగ్ రాజ్యసభ ఎంపీని కలిగి ఉన్న బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు.
ఎందుకంటే ఆ పార్టీకి యూపీ అసెంబ్లీలో సభ్యులు లేనందున ఆ పార్టీకి రాజ్యసభ సీటు దక్కే అవకాశం లేదు. బీఎస్పీకి ఇది క్లిష్టకాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే యూపీ అసెంబ్లీలోని ఉభయ సభల్లో ఒక్కరు కూడా లేరు. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఒక్క సభ్యుడూ లేడు. అంటే, రాష్ట్రంలో, కేంద్రంలోని చట్ట సభల్లో ఒక్క సభ్యుడు కూడా లేని స్తితికి బీఎస్పీ చేరుకుంది. 1989 తర్వాత బీఎస్పీకి ఈ పరిస్థితి ఇదే తొలిసారి.
ఇక, ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒక్క స్థానాన్ని బీజేపీ దక్కించుకోనుంది. ఆ పార్టీకి అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్నందున ఆ రాజ్యసభ సీటు బీజేపీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్‌లో కూడా ఈ సీటును బీజేపీయే గెలుచుకోనుంది.

More Stories
రాజస్థాన్‌లో ఏడుగురులో ఆరుగురు మేయర్ లను గెల్చుకున్న బిజెపి
శబరిమల ఆలయంలో ప్రసాదాలు అందకపోవడంపై దుమారం
పౌరసత్వం కేసులో సోనియా గాంధీపై దర్యాప్తునకు ఆదేశాలు