అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ భూభాగాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటానన్న బెదిరింపులతో రేగిన దౌత్యపరమైన వివాదాన్ని పరిష్కరిస్తూ, గ్రీన్‌ల్యాండ్ భద్రతపై అమెరికా, డెన్మార్క్ ఒక ఒప్పందాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం అమెరికాకు “భద్రతపై, అన్ని ఇతర అవసరాలపై శాశ్వత నియంత్రణను” కల్పిస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం “ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో భద్రతను బలోపేతం చేస్తుంది” అని డెన్మార్క్ ప్రధానమంత్రి తెలిపారు.
కానీ ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రస్తావించిన ఒప్పందంలోని నిర్దిష్ట అంశాల గురించి ఆమె మాట్లాడలేదు. రక్షణ ప్రయోజనాల కోసం దాని వ్యూహాత్మక స్థానం, ఖనిజ సంపదను ఉటంకిస్తూ, జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా గ్రీన్‌ల్యాండ్‌ను “స్వాధీనం చేసుకుంటానని” ట్రంప్ నెలల తరబడి బెదిరించిన తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఈ ఒప్పందంపై సంతకం చేయనున్నట్లు డెన్మార్క్ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడెరిక్సెన్ ధృవీకరించారు.
ఈ ఒప్పందం “ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో మన ఉమ్మడి భద్రతను బలోపేతం చేస్తుంది” అని, అదే సమయంలో “రాజ్యం సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను మరియు గ్రీన్‌ల్యాండ్ ప్రజల స్వీయ-నిర్ణయాధికారాన్ని గుర్తిస్తుంది” అని ఆమె పేర్కొన్నారు. గ్రీన్‌లాండ్ భద్రత, ఇతర అవసరాలపై అమెరికాకు శాశ్వత నియంత్రణ కల్పించేలా డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రభుత్వాలతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
గ్రీన్‌ల్యాండ్, అమెరికా భద్రతను కాపాడేందుకు డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రతినిధులతో కలిసి పనిచేశామని చెబుతూ ఈ శాశ్వత ఒప్పందానికి అమెరికా ఎలాంటి ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. కాగా, ఈ ఒప్పందానికి ఇంకా చట్టసభ సభ్యుల ఆమోదం అవసరమని, “అమలులోకి రావడానికి అవసరమైన పార్లమెంటరీ ప్రక్రియల ద్వారా వెళ్ళవలసి ఉంటుందని” ప్రధాని తెలిపారు.
గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్, అమెరికాల “భద్రతను నిర్ధారించి, బలోపేతం చేసే ఒక ఒప్పందంలోకి మనం ప్రవేశించబోతున్నామన్నది సంతోషకరమైన విషయం” అని ఈ ఒప్పందాన్ని ప్రకటిస్తూ గ్రీన్‌ల్యాండ్ ప్రభుత్వ ఛైర్మన్ జెన్స్-ఫ్రెడెరిక్ నీల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖనిజ సంపదతో నిండిన ఈ డానిష్ భూభాగం, రష్యా, చైనాలతో సహా శత్రువుల దాడికి గురయ్యే అవకాశం ఉందని వాదిస్తూ, దానిని కొనుగోలు చేయడానికి లేదా విలీనం చేసుకోవడానికి ట్రంప్ నెలల తరబడి ప్రయత్నించారు.
ఆయన గ్రీన్‌ల్యాండ్‌లో సైనిక చర్యకు కూడా బెదిరించారు, దీంతో డానిష్ ప్రజలు, ఇతర నాటో దేశాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తాజా ఒప్పందం ప్రకారం అమెరికా లిఖితపూర్వక అనుమతి లేకుండా గ్రీన్‌లాండ్‌లో మరో ఇతర దేశం సైనిక స్థావరాలు ఏర్పాటు చేయడం, పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని ట్రంప్ స్పష్టం చేశారు. త్వరలో గ్రీన్‌లాండ్ ప్రజల సహకారంతో అనువైన ప్రాంతంలో భారీ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
గ్రీన్‌లాండ్‌లో ఎన్నో అనేక అనువైన ప్రాంతాలు ఉన్నాయని పేర్కొంటూ వాటిలో ఒక పెద్ద సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను తాము వెంటనే ప్రారంభిస్తామమని ట్రంప్ ప్రకటించారు. గ్రీన్‌లాండ్ అభివృద్ధి, నిర్మాణంలో అక్కడి ప్రజలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. తాము చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, డెన్మార్క్, గ్రీన్‌లాండ్ మిత్రదేశాలన్నింటికీ ఎంతో మేలు చేసేదని తెలిపారు.
ఈ వ్యూహాత్మకమైన ఒప్పందంలో భాగంగా ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం డెన్మార్క్, గ్రీన్‌లాండ్ ప్రజలతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని చెప్పారు. ‘మేము దీనిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాము. ఇది అమెరికా ఒక కల నిజమైన క్షణం. ఇది చాలా ముఖ్యం, ప్రత్యేకం. అలాగే చారిత్రాత్మకమై నిర్ణయం’ అంటూ ట్రంప్ స్పందించారు. మరోవంక, సీఎన్‌ఎన్, ఎంఎస్‌నౌ, పొలిటికో మీడియా సంస్థల్ని వైట్‌హౌస్‌లోకి రాకుండా నిషేధం ట్రంప్ విధించారు. ఈ మీడియా సంస్థలు తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తునాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరైనా తనకపై తప్పుడు వార్తలు రాస్తే వేటు తప్పదని ఆయన హెచ్చరించారు.

More Stories
రష్యాపై ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం
జెన్ జెడ్ ధర్మం గురించి చర్చించడం పట్ల మోహన్ భగవత్ హర్షం
జేఎన్‌యూలో కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణల దుమారం