‘ఖేలో ఇండియా’ కార్యక్రమం ద్వారా.. దేశంలోని యువ క్రీడాశక్తిని ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’, ‘ఖేలో ఇండియా పారా గేమ్స్’, ‘ఖేలో ఇండియా వింటర్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా బీచ్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’, ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ వంటి క్రీడాపోటీల నిర్వహణ ద్వారా క్రీడాకారులు తమలో దాగిఉన్న క్రీడా ప్రతిభను, తమలోని నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. ఈ ఎడిషన్‌లో మొత్తం 25 క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఆతిథ్య రాష్ట్రమైన తెలంగాణ ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించవచ్చు. దీంతోపాటుగా మరో కొత్త క్రీడను కూడా ఈ ఈవెంట్లో ఆడించనున్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 6వేల మంది స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొంటారని అంచనా.
ఈ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ నిర్వహణకోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లను విడుదల చేసింది. ఈ క్రీడాపోటీలను రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ), నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్), స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జిఎఫ్ఐ), సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఖేలో ఇండియా పథకం అడ్ హక్ కమిటీ, స్టీరింగ్ కమిటీల సంయుక్త నిర్వహణలో నిర్వహించనున్నారు.
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను తెలంగాణకు కేటాయించడం పట్ల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘ఖేలో ఇండియా’ స్కీమ్ లో భాగంగా తెలంగాణలో కూడా దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాలను కల్పన జరిగిందని, అందులో రూ.11.5 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో సింథటిక్ ట్రాక్, సింథటిక్ టెన్నిస్ కోర్ట్, మహిళలకోసం ప్రత్యేక స్విమ్మింగ్ పూల్ వంటి సౌకర్యాలను కల్పించారని, మరో రూ.18.5 కోట్లతో రాష్ట్రంలోని వివిధ పట్టణాలలో క్రీడా సదుపాయాలను కల్పించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు తేజం.. బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా టాప్స్ కార్యక్రమం ద్వారా అంతర్జాతీయ స్థాయి శిక్షణ, సపోర్టింగ్ స్టాఫ్ సహకారంతో ఒలింపిక్స్ మెడల్ సాధించింది. క్రీడారంగంలో ఆమె రాణిస్తున్న తీరును ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015లో పద్మశ్రీ, 2020లో పద్మభూషణ్ అవార్డును అందించింది.
మరోవైపు, ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే ను పురస్కరించుకుని.. గురువారం (ఆగస్టు 27న) దేశవ్యాప్తంగా ‘ఖేల్ కీ బాత్, పీఎం కే సాథ్’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి 2 కాలేజీల చొప్పున 1,500 లకు పైగా కాలేజీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడలు, ఫిట్‌నెస్ తో పాటు యువత నేతృత్వంలో దేశ నిర్మాణానికి సంబంధించిన అంశాల మీద గౌరవ ప్రధానమంత్రి మోదీ వర్చువల్ గా ప్రసంగించడంతోపాటు క్రీడల పట్ల యువత ఆలోచనలు, ఆకాంక్షల గురించి వారితో మాట్లాడి తెలుసుకోనున్నారు.

More Stories
తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు.. బిజెపి 7 డిమాండ్లు
తీవ్ర అసహనంతో కూడిన మేధో ఉగ్రవాదానికి ముగింపుగా భగవత్ సందేశం
ఎం.ఎస్. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్’ కు డాక్టర్ వైఎస్.అవార్డు – 2026