నోటీసు ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఆ తర్వాత మరో నెల పాటు అభ్యంతరాలు, వివరణలు తీసుకుంటారు. ప్రక్రియ అంతా ముగిశాక తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా స్పందించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో మీ పేరు వెతకడానికి ముందుగా మీ ప్రస్తుత పోలింగ్ బూత్, పార్ట్ నంబర్ తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో కొంతమంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఎన్నికల సంఘం సెర్చ్ పోర్టల్‌లో ఎపిక్ నంబర్ లేదా అందుబాటులో ఉన్న వ్యక్తిగత వివరాలతో మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.

More Stories
ఈ సెషన్స్ మొత్తం బీఆర్ఎస్ ఎమ్యెల్యేల సస్పెన్షన్
ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, బీఆర్ఎస్ వీధి నాటకాలు
మహిళా కమిషన్ చైర్ పర్సన్ పదవి తిరస్కరించిన శారద!